VAISHNAV TEJ: రెండో సినిమా రిలీజ్‌కు ముహూర్తం పెట్టిన వైష్ణ‌వ్‌.. ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

VAISHNAV TEJ ఉప్పెన సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో అద్భుతమైన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో 100శాతం సీట్ల ఆక్యూపెన్సీ తో పాటు విజయవంతంగా దూసుకుపోతున్న సినిమాగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్ లో 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం విశేషం. ఇక ఈ యంగ్ హీరో మొదటి సినిమా రిలీజ్ కి ముందే ఓ సినిమాను పూర్తి చేసిన విషయం అందరికి తెలిసిందే.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ ఓ సినిమా చేసాడు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. అచ్చమైన పల్లెటూరి కథగా ఈ చిత్రాన్నితెరకెక్కించాడు క్రిష్. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

పక్కా పల్లెటూరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన కథ, కథనంతో సాగుతుంది. ఈ సినిమా పేరు ప్రస్తుతానికి కొండపోలం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ పేరునే కొనసాగిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే వైష్టవ్ తేజ్ మూడో సినిమా గురించి కూడా నెట్టింట్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా అక్కినేని వారి బ్యానర్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పై జరుగుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement