Vaishnav Tej New Movie Update : వైష్ణవ్ తేజ్ ను స్టార్ ను చేసేందుకు రంగంలోకి అరవింద్.. బడా ప్రాజెక్టుతో భారీ ప్లాన్..!

NQ Staff - June 29, 2023 / 09:33 AM IST

Vaishnav Tej New Movie Update : వైష్ణవ్ తేజ్ ను స్టార్ ను చేసేందుకు రంగంలోకి అరవింద్.. బడా ప్రాజెక్టుతో భారీ ప్లాన్..!

Vaishnav Tej New Movie Update : మెగా హీరోల సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటాయనే టాక్ ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. ఇక మెగా మేనళ్లుల్లుగా వచ్చిన సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

కానీ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. దాంతో ఆయన ఇమేజ్ డౌన్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఆయన్ను స్టార్ హీరోను చేసే పనిలో పడ్డాడు అల్లు అరవింద్. ఇందుకోసం భారీ ప్లాన్ వేశాడంట. ఏజెంట్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైలమాలో ఉన్నాడు. ఆయనకు తర్వాత సినిమా పవన్ తో కమిట్ మెంట్ ఉంది.

కానీ పవన్ ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా వారాహి యాత్రలో ఉన్నాడు. కాబట్టి సురేందర్ రెడ్డి సినిమా చేయలేడు. కాబట్టి పవన్ కోసం రాసుకున్న కథతో వైష్ణవ్ తేజ్ తో చేయించాలని చూస్తున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ కోసం భారీ యాక్షన్ సీన్లతో కూడిన కథను ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కోసం వినియోగిస్తున్నారు. దాంతో ఆ కథకు తగ్గట్టే బడ్జెట్ పెట్టేందుకు కూడా అల్లు అరవింద్ రెడీ అయిపోయాడు. ఈ సినిమా గనక వర్కౌట్ అయితే భారీ హిట్ ఖాయమే. అదే జరిగితే వైష్ణవ్ కెరీర్ లో మరో మైలురాయి వచ్చి చేరుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us