Vaishnav Tej: తనకు గర్ల్ ఫ్రెండ్ ఇంకా సెట్ కాలేదంటున్న వైష్ణవ్ తేజ్

Vaishnav Tej: టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్తవారికి ఎప్పుడూ సాధరంగా ఆహ్వానిస్తుంది. అందులోనూ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న యంగ్ హీరోలైతే ఇక చెప్పక్కర్లేదు. అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల క్రేజ్ మాములుగా ఉండదు. ఉప్పెన సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు వైష్టవ్ తేజ్. ఈ సినిమాలో ఎంతో వినూత్నంగా తన ప్రతిభను కనబరిచారు వైష్ణవ్ తేజ్.

Vaishnav Tej

ఉప్పెన హీరోయిన్ యాక్టింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కృతి శెట్టి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా క్రేజ్ సంపాదించుకుంది. అంతేనా ఎంతోమంది స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం కొట్టేసింది. ఇప్పుడు కృతి శెట్టి కోసం ఎంతోమంది హీరోలు తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకు హీరో వైష్ణవ్ తేజ్ కి ప్రియురాలు ఇంకా సెట్ కాలేదంట.

ఉప్పెన సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవ్ కి ఫిమేల్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అయితే తనకు రియల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ లేదని అంటున్నారు. అలాగే డేటింగ్ చేసే ఉద్దేశ్యం లేదట. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం సినిమాపైనే అని చెబుతున్నాడు. రీసెంట్ గా వైష్ణవ్ అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఈ క్రమంలో వైష్ణవ్ అనేక విషయాలు బయటపెట్టాడు.

Vaishnav Tej

అందరూ భావిస్తున్నట్లు తన అభిమాన హీరో తన మామయ్య చిరంజీవి కాదంట. సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే పిచ్చ లైకింగ్ అంట. వైష్ణవ్ రెండో సినిమాని క్రిష్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ యాక్ట్ చేశారు.

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా త్వరలోనే విడుదల అవుతుంది. ఇక వైష్ణవ్ మూడో సినిమా గిరీశయ్య అనే తమిళ్ దర్శకుడు చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత కథలు కూడా చాలా సెలెక్టెడ్ గా ఉండేలా వైష్ణవ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.