Vaishnav: మెగా ఫ్యాన్స్‌కి షాక్..త‌న ఫేవ‌రేట్ హీరో చిరు కాద‌ని చెప్పిన వైష్ణ‌వ్

Vaishnav: స్వ‌యంకృషితో ఉన్న‌త స్థాయికి ఎదిగిన చిరంజీవి ఎంద‌రికో ఆద‌ర్శం.ఆయ‌న‌ని స్పూర్తిగా తీసుకొని చాలా మంది హీరోలుగా మారారు.చిరు స్టైల్‌, ఆయ‌న డ్యాన్స్‌లో గ్రేస్‌, విల‌న్స్‌ని ర‌ఫ్పాడించే తీరు చాలా మందిని సినిమా హీరోలుగా మార్చింది. ఇప్పుడున్న‌హీరోల‌లో చాలా మందికి చిరంజీవి ఫేవ‌రేట్ హీరో. ఇక మెగా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోల‌కు కూడా చిరంజీవి ఆల్‌టైమ్ ఫేవ‌రేట్‌. అత‌ను వేసిన బాట‌లోనే అంద‌రు ప‌య‌నిస్తున్నారు.

ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్.తొలి చిత్రంలోనే త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని మెప్పించిన వైష్ణ‌వ్ తేజ్ భారీ హిట్టే కొట్టాడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. దీంతో వైష్ణవ్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాను ఎప్పుడో విడుద‌ల చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది.

వైష్ణ‌వ్ తేజ్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన వైష్ణవ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. ఆస్క్ మీ అనే సెష‌న్‌లో అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. ఓ నెటిజ‌న్ మీ అభిమాన న‌టుడు ఎవ‌రు అని అడ‌గ‌గా, అంద‌రు చిరంజీవి పేరు చెబుతారు అని అనుకున్నారు. కాని ఊహించ‌ని విధంగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ పేరు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ర‌జ‌నీకాంత్ సినిమాలో ఏ సినిమా ఇష్టమని అడగ్గా.. శివాజి అని సమాధానం ఇచ్చాడు వైష్ణవ్‌. అలాగే మలయాళ నటి నజ్రియా నజీమ్‌ తన ఫేవరేట్‌ యాక్ట్రస్‌ అని కూడా చెప్పుకొచ్చాడు. వైష్ణ‌వ్ తేజ్ చెప్పిన స‌మాధాన‌ల‌కు మెగా అభిమానులు షాక్ అయ్యారు. కాగా, ప్ర‌స్తుతం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్‌ చేసిన గిరీశయ్యతో సినిమా చేస్తున్నాడు ఈ మెగా హీరో.ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్‌ పూరీ హీరోగా రూపొందుతున్న ‘రొమాంటిక్’ నటిస్తుంది. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుండి ఓ నూతన దర్శకుడి డైరెక్ష‌న్లో వైష్ణ‌వ్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.