Vaishnav-tej: రంగ‌రంగ వైభవంగా వైష్ణ‌వ్ తేజ్ మూడో చిత్రం.. లిప్ లాక్ పెట్టేశాడుగా..!

Vaishnav-tej: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ .. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఉప్పెన తర్వాత ఆయన తాజాగా నటించిన సినిమా కొండపొలం . ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కానీ ఓటీటీతో పాటు తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి.

vashav tej new project
vashav tej new project

ఇక మూడో సినిమాకి సంసిద్ధం అవుతున్న నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు. ఇవాళ ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు.

రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ తో వైష్ణవ్ రాబోతున్నాడు. ఇందులో వైష్ణవ్ సరసన రొమాంటిక్ సినిమాతో కుర్రకారుకి మత్తెక్కించిన కేతిక శర్మ నటించనుంది. టైటిల్ తో ఉన్న ఈ గ్లింప్స్ లో కేతిక, వైష్ణవ్ మధ్య మంచి రొమాంటిక్ సీన్ ని, డైలాగ్స్ ని కూడా చూపించారు. దీంతో ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది

మరోవైపు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. కేవీ అనుదీప్.. గతంలో పిట్టగోడ అనే ఓ ఒక చిన్న సినిమా తీశాడు. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం దర్శకుడు అనుదీప్‌లో సత్తా ఉందని నిరూపించుకున్నాడు.

ఆ సినిమా వచ్చిన ఐదు సంవత్సరాలకు జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఆయన మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం నుంచి రీసెంట్‌గా వచ్చిన జాతి రత్నాలు సినిమా వరకు అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్ నిర్మించాడు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో అదరగొడుతోంది.