Vaishnav tej: బ‌న్నీ త‌న‌య‌తో వైష్ణవ్ తేజ్ ఎంజాయ్‌మెంట్‌.. వీడియో హ‌ల్ చ‌ల్‌

Vaishnav tej:బ‌ర్త్ డే బాయ్ వైష్ణ‌వ్ తేజ్ కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా నిహారిక ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నిహారిక, వైష్ణవ్‌లు చిన్న పిల్లల్లా కొట్టకుంటూ కనిపించారు. పిల్లలు ఆడుకునే ప్లెయింగ్‌ నెట్‌లో కూర్చుని బాల్స్‌తో వీరిద్దరూ కొట్టుకుంటున్న వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

vaishnav tej fun with arha
vaishnav tej fun with arha

దీనికి ‘ఈ వీడియో మన ఇద్దరి మధ్య బాండింగ్‌ను ఈ వీడియో నిర్వచిస్తుంది(ఎప్పుడు గొడవ పడుతూ, పక్కవారికి ఇబ్బంది లేకుండా సైలెంట్‌ జోక్స్‌తో మా వెర్రిలో మేముంటాం). మాటల కంటే చర్యలు పెద్దవి అనడానికి ఇది ఉదాహరణ అని పేర్కొంది. ఇక తాజాగా వైష్ణ‌వ్ తేజ్‌కి సంబంధించిన మ‌రో వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

బ‌న్నీ కూతురు అర్హ‌తో వైష్ణ‌వ్ తేజ్ చిల్ అవుతున్నాడు. ఈ వీడియో బ‌న్నీ ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్స్‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. వైష్ణ‌వ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌స్తున్నాయి. గురువారం వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విషెస్ తెలియ‌జేశారు.

ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడీగా యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది.సితార ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ విఎస్ సి బ్యానర్ లపై బిఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణ‌వ్ తేజ్ త‌న రెండో సినిమాగా కొండ‌పోలం సినిమా చేశాడు. ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేదు. ఇప్పుడు మూడో సినిమాతో అంద‌రిని అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాడు.