Vaishnav Tej: గొర్రెలు కాయ‌డం క‌ష్ట‌మా, ర‌కుల్‌తో రొమాన్స్ క‌ష్ట‌మా అన్న ప్ర‌శ్నకు వైష్ణ‌వ్ స‌మాధానం..!

ఉప్పెన చిత్రంతో వెండితెర‌ డెబ్యూ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్ త‌న రెండో సినిమాగా కొండ పొలంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రీయేటీవ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్, ర‌కుల్‌, వైష్ణ‌వ్, చంద్ర బోస్ సినిమాకి సంబంధించిన విష‌యాలు వెల్ల‌డించారు.

సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక‌ అద్బుతమైన కథ. చ‌క్కటి కథనంతో రాశారు. ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఎగ్జైట్‌గా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకుని కొండమీదకు వెళ్తారు. అక్క‌డ జ‌రిగే ప‌రిణామాలేంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని క్రిష్ అన్నారు.

కరోనా సమయంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వింత వింతగా అనిపించింది. అన్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లాం. మళ్లీ మళ్లీ సిటీకి వచ్చి చేయడానికి వీల్లేదు. మేం కూడా బాయ్‌లానే కెమెరాలను మోశాం. ఇక వెయ్యి గొర్రెలను అడవిలోకి తీసుకెళ్లడం. వాటితో షూట్ చేయడం చాలా కష్టంగా మారింది. అలా కరోనా సమయం, అడవిలో షూటింగ్ చేయడం అనేది సవాళ్లుగా మారాయి అన్నారు క్రిష్‌.

ఇక ఓ ఇంట‌ర్వ్యూలో గొర్రెలు కాయ‌డం క‌ష్ట‌మా, ర‌కుల్‌తో రొమాన్స్ చేయ‌డం క‌ష్ట‌మా అన్న ప్ర‌శ్న‌కు రొమాన్స్ క‌ష్టం అని వైష్ణవ్ పేర్కొన్నాడు.అదే విష‌యాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావించారు. అయితే తాను అలా అన‌డానికి కార‌ణం ర‌కుల్ చాలా సీనియ‌ర్ హీరోయిన్ త‌న‌తో రొమాన్స్ అంటే భ‌యం వేసింద‌ని అన్నాడు వైష్ణవ్.

ఇక వీళ్లున్న ప్ర‌దేశానికి రెండు కిలో మీట‌ర్ల‌దూరంలో కార్‌వ్యాన్ ఉండ‌డంతో ర‌కుల్ చెట్ల వెనుక బ‌ట్టలు మార్చుకునేద‌ట‌. కార్ వ్యాన్‌కి వెళ్లి బ‌ట్ట‌లు మార్చుకొని రావాలంటే 40 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అందుకే అక్క‌డే గొడుగులు అడ్డు పెట్టుకొని బ‌ట్టలు మార్చుకున్నా అని ర‌కుల్ తెలియ‌జేసింది.

వైష్ణవ్ తేజ్ కళ్లు బాగా అట్రాక్ట్ చేశాయి. వైష్ణవ్ తేజ్‌కు మీ కళ్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ తో అన్నాను. కాదు కాదు అవి మా నాన్న కళ్లు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కొండపొలం’ సినిమా చేసి వస్తాను అని పవన్ కళ్యాణ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆ తరువాత నిర్మాత ఎఎం రత్నంకు కూడా చెప్పాను. కారులో బయల్దేరి ఇంటికి వచ్చే సమయంలోనే సినిమాలో హీరో ఎవరా? అని ఆలోచించాను. ఒక్కసారిగా వైష్ణవ్ ఆలోచనల్లోకి వచ్చారు.

వైష్ణవ్‌కు ఫోన్ చేసి కలుద్దాం రమ్మని చెప్పాను. సినిమా గురించి మాట్లాడతాను అని వైష్ణవ్ అనుకోలేదు. కొండపొలం గురించి వైష్ణవ్ తేజ్‌కు చెబితే.. మీరు హరిహరవీరమల్లు చేస్తున్నారు కదా? అని అన్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పాను. అయితే సరే అని వైష్ణవ్ అన్నాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, చిరంజీవిలతో వైష్ణవ్ ఈ చిత్రం గురించి చెప్పాడు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్, వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అలా వైష్ణవ్ లైన్‌లోకి వచ్చాడు.

వైష్ణవ్ తేజ్‌కు నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ అస్సలు ఉండదు. అది అస్సలు అతనికి తెలియదు. సెట్‌లో అందరికంటే ముందుంటాడు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా పరిశీలిస్తుంటాడు. ప్రతీ సీన్‌ను కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తాడు. సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఉప్పెన లాంటి కథను ఎంచుకున్నాడు.. కొండపొలం కూడా ఎంచుకున్నాడు. ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంది.

జ్ఞాన శేఖర్ సూచనతోనే రకుల్‌ను ఈ సినిమాకు తీసుకున్నాం. కెమెరామెన్ చెబితే ఎప్పుడూ తప్పుకాదు. అలా ఈ కథను రకుల్‌కు చెప్పేందుకు వెళ్లాను. ఓబులమ్మ పాత్రకు సరిపోతుందని అనుకున్నాను. ఇక ఈ పాత్ర కోసం మరింత స్లిమ్‌గా మారింది.

హరిహర వీరమల్లు మార్చి 12 వరకు షూటింగ్ చేశాం. దాదాపు 25 శాతం పూర్తయింది. ఆ తరువాత లాక్డౌన్ వచ్చింది. సినిమా పరిశ్రమ మొత్తం స్థంభించిపోయింది. పనులు లేక అందరూ ఖాళీగా ఉన్నారు. అందుకే గ్యాప్‌లో ఓ సినిమా చేద్దాం, అందరికీ పని కల్పించినట్టు ఉంటుందని అనుకున్నాను. సెప్టెంబర్, అక్టోబర్‌లో షూటింగ్ చేసేస్తాను అని చెప్పాను. నవంబర్ రెండో వారం నుంచి మళ్లీ హరి హర వీరమల్లు షూటింగ్ ప్రారంభిస్తాం అని క్రిష్ తెలిపారు.