Vadinamma : ట్రైన్‌లో ‘వదినమ్మ’ యూనిట్ సందడి.. అంతా అక్కడికే మకాం!

Vadhinamma team off to Kakinada for latest schedule
Vadhinamma team off to Kakinada for latest schedule

Vadinamma బుల్లితెర పై సీరియల్స్ ఇప్పుడు ఏ రేంజ్‌లో సత్తా చాటుతున్నాయో అందరికీ తెలిసిందే. సినిమాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరపై అంతటి భారీదనం ఉట్టిపడేలా నిర్మిస్తున్నాడు. లాక్డౌన్ కరోనా వల్ల బుల్లితెరకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు బుల్లితెర అంటే వెండితెరకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు కేవలం రెండు మూడు ఇళ్లల్లోనే షూటింగ్‌లు కానిచ్చేవారు.

కానీ ఇప్పుడు మాత్రం సీరియల్స్ షూటింగ్ కూడా అవుట్ డోర్ ప్లాన్ చేస్తున్నారు. ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అలా ఇప్పుడు వదినమ్మ సీరియల్ యూనిట్ కూడా అవుట్ డోర్ షూటింగ్‌కు బయల్దేరింది. అసలే ఇప్పుడు స్టార్ మాలో వదినమ్మ సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. కార్తీకదీపం, గృహలక్ష్మీ సీరియల్స్ తరువాత వదినమ్మ మూడో స్థానంలో టాప్ రేటింగ్స్‌ను రాబడుతోంది. ఆ మధ్య టైమింగ్స్ చేంజ్ చేయడంతో కాసింత దెబ్బ పడింది.

Vadhinamma team off to Kakinada for latest schedule
Vadhinamma team off to Kakinada for latest schedule

ట్రైన్‌లో ‘వదినమ్మ’ యూనిట్ సందడి..
అయితే వదినమ్మ సీరియల్‌కు ప్రభాకర్, సుజిత పెద్ద బలంగా మారారు. వీరిద్దరి నటనతో వదినమ్మ సీరియల్‌ను టాప్‌లో ఉంచేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ యూనిట్ మొత్తం కాకినాడకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వదినమ్మ ఫేమ్ శైలు తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఇందులో వదినమ్మ మెయిన్ లీడ్ ఆర్టిస్ట్‌లందరూ కూడా ట్రైన్‌లో కాకినాడ బయల్దేరారు. నిన్న రాత్రే కాకినాడలో దిగినట్టున్నారు. ఇక నేటి ఉదయం నుంచి కాకినాడ బీచ్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను జరుపుతున్నట్టు ఆ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.

Advertisement