Vaani kapoor: వాణి క‌పూర్ గ్లామ‌ర్ షో.. న‌వ్వుతోనే ఫిదా చేస్తున్న‌బాలీవుడ్ బ్యూటీ

Vaani kapoor: ‘ఆహా కళ్యాణం’ చిత్రంలో నాని సరసన మెరిసిన భామ వాణీ కపూర్. ఈ సినిమా పెద్దగా అలరించకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపురాలేదు. శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వాణి ఇప్ప‌టివ‌ర‌కు త‌క్కువ చిత్రాల్లోనే న‌టించినా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.

vaani kapoorstunning look1
vaani kapoorstunning look1

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ త‌ర‌చుగా త‌న హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రౌన్ ధరించి క్లీవేజ్ షో చేసింది. మ‌రో డ్రెస్‌లో న‌వ్వుతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. వాణీ క‌పూర్ స్టన్నింగ్స్ లుక్స్ కి అంద‌రు ఫిదా అవుతున్నారు.

vaani kapoorstunning look
vaani kapoorstunning look

స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వాణీ క‌పూర్ కి స‌లార్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ లో కీల‌క‌ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే సలార్ మూవీలో ప్రభాస్ కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

vanikapoor stunning
vanikapoor stunning

సినిమాలోని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ కీలక పాత్ర లో వాణీ క‌పూర్ కనిపించనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది.