UV CREATIONS: పెద్ద సంస్ధ దృష్టి చిన్న సినిమాల‌పై ప‌డిందేంటి ?

Priyanka - May 15, 2021 / 09:57 AM IST

UV CREATIONS: పెద్ద సంస్ధ దృష్టి చిన్న సినిమాల‌పై ప‌డిందేంటి ?

క‌రోనా మ‌హ‌మ్మారి పెను మార్పులు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమా రంగంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.క‌రోనా వ‌ల‌న డిజిట‌ల్ ప్లాట్‌ఫాంపై దృష్టి ఎక్కువ‌గా సారిస్తున్నారు. ఓటీటీల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రభాస్ సొంత సంస్థ లాంటి యువీ క్రియేష‌న్ ఓటీటీలో ప‌లు సినిమాల‌ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ వంటి భారీ సినిమా చేస్తున్న ఈ బ్యానర్ రానున్న రోజుల‌లో ఐదు చిన్న చిత్రాలతో అల‌రించ‌నుందట‌.


బిజినెస్ లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు యువీ క్రియేష‌న్స్ కొత్త పుంత‌లు తొక్కుతుంది. ఓటీటీ కోసం సినిమాల‌ను నిర్మించే ప‌నిలో ఉండ‌గా, వీటి వ‌ల‌న ఇండస్ట్రీలో ఆపర్స్ కోసం తిరిగే వారికి ‘యువి క్రియేషన్స్’ ఇప్పుడు కల్పతరువులా కనిపిస్తోంది. మంచి కథతో వెళ్లి ఒప్పిస్తే డైరక్షన్ ఛాన్స్ ఇస్తున్నారట. దాంతో చాలా మంది యంగ్ బ్యాచ్ డైరక్ట్ గా యువి క్రియేషన్స్ బ్యానర్ ని డైరెక్ట్ గా ఎప్రోచ్ అవుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us