Uttej: ఉత్తేజ్ కూతురు సీమంతం వేడుక‌.. హాజ‌రైన గీతా మాధురి, తనీష్‌

Uttej: టాలీవుడ్ ఫేమ‌స్ యాక్ట‌ర్ ఉత్తేజ్ అంద‌రికి సుప‌రిచిత‌మే. నటుడిగానే గాక రచయితగా ఎంతో టాలెంట్ ఉన్న ఉత్తేజ్.. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత నటుడిగా మారారు.

uttej-daughter-srimantham function
uttej-daughter-srimantham function

మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ లాంటి సినిమాలకు సంభాషణలు రాసిన ఆయన.. మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారు. ఆయ‌న భార్య ప‌ద్మావ‌తి ఇటీవ‌ల క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. అయితే త‌ల్లిని కోల్పోవ‌డంతో కూతుళ్లు చేత‌న, పాట చాలా బాధ‌లో ఉన్నారు. పెద్ద కూతురు చేత‌న ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి కాగా ఇటీవ‌ల బేబి బంప్ పిక్స్ షేర్ చేసింది.

uttej-daughter-srimantham function1
uttej-daughter-srimantham function1

ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది చేత‌న. అయితే తాజాగా చేత‌న సీమంతం వేడుక జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఉత్తేజ్ చిన్న కూతురు పాట‌, గీతా మాధురి, తనీష్‌తో పాటు ప‌లువురు కుటుంబ స‌భ్య‌లు హాజ‌ర‌య్యారు.

uttej-daughter-srimantham function2
uttej-daughter-srimantham function2

చిత్రం సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్‌ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు. సీమంతం వేడుక‌లోను ఆయ‌న క‌నిపించలేదు.

ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు చేతన ఉత్తేజ్, పాట. పెద్దమ్మాయి చేతన బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. చిన్న కూతురు పాట‌కి కూడా మంచి టాలెంట్ ఉంది. రీసెంట్‌గా అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అందరినీ ఆకర్షించింది.