UTEJ: నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది.. స‌తీమ‌ణిని త‌ల‌చుకుంటూ ఉత్తేజ్ ఎమోష‌న‌ల్ పోస్ట్

UTEJ: నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సెప్టెంబర్ 13న ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. భార్య మరణంతో ఉత్తేజ్, అమ్మ మరణంలో కూతుళ్లిద్దరూ తల్లిడిల్లిపోయారు. వారిని సినీ ప్రముఖులందరూ ఓదార్చారు. ఇక ఉత్తేజ్, ఆయన చిన్న కూతురు పాట ఉత్తేజ్ చిరంజీవి ఒళ్లో తలవాల్చి భోరుమని విలపించారు.

utej amotional on his wife birthday2
utej amotional on his wife birthday2

పాట ఉత్తేజ్ ఇటీవ‌ల‌న‌ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ చూస్తే అమ్మను ఎంతలా మిస్ అవుతుందో తెలుస్తోంది. భోరున ఏడుస్తూ అమ్మ కోసం పరితపిస్తోంది. పాట ఉత్తేజ్ షేర్ చేసిన ఫోటోలు, పెట్టిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. ‘అమ్మా.. ఐ లవ్యూ.. మాతో నువ్ లేవనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను.. నువ్వే మా ప్రాణం.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. నాన్న కోసం, మా కోసం నువ్ ఎంతగా కష్టపడ్డావో మాకు తెలుసు అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

తాజాగా న‌టుడు ఉత్తేజ్ సోషల్ మీడియా వేదికగా ఆయన తన భార్యను తలుచోకొని భావోద్వేగానికి గురయ్యారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా.

utej amotional on his wife birthday1
utej amotional on his wife birthday1

మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన ప్రతిఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. నటుడు ఉత్తేజ్‌ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్‌ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది