Urvashivo Rakshashivo Teaser: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఏకంగా లిఫ్ట్ లోనే బరి తెగించేశారా.?
NQ Staff - September 29, 2022 / 11:04 PM IST

Urvashivo Rakshashivo Teaser: బాబోయ్.. మరీ ఇంత స్పైసీనా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంత సీన్ లేదు, ఇంతకన్నా దారుణాలు చూసేశాం.. అని ఇంకొందరు అంటున్నారు.
చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తోన్న అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ గురించే ఇదంతా. అప్పుడెప్పుడో వేరే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని మార్చి, తాజాగా ‘ఊర్వశివో రాక్షసివో’ అంటూ కొత్త టైటిల్ పెట్టారు.
లిప్ కిస్‌తో మొదలు పెట్టి.. పడక మంచం సీన్స్ వరకూ..
లిఫ్టులో లిప్ కిస్ సీన్, పడక గదిలో మాంఛి ఘాటైన సన్నివేశం.. ఇలా సాగింది టీజర్. ‘ఆల్ట్ బాలాజీ’ టైపు.. అంటూ సినిమాలో వెన్నెల కిషోర్ ఓ డైలాగు కూడా పేల్చాడు.
అసభ్యకరమైన కంటెంట్ కోసమైతే ఓటీటీలు అందుబాటులోనే వున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో వుంది ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషనల్ వీడియో.
టీజర్‌తోనే ఇంత హాటుగా రెచ్చగొట్టేస్తోంటే, సినిమాలో ఈ ఇద్దరూ ఇంకేం చేసేశారో.! దర్శకుడెవరు.? సంగీత దర్శకుడెవరు.? ఇవన్నీ అప్రస్తుతం అన్నట్లే వుంది వ్యవహారం. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన అనూ ఇమ్మాన్యుయేల్, చేయడానికైతే అగ్ర హీరోలతో సినిమాలు చేసిందిగానీ.. ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించేసుకుంది.
దాదాపుగా తెరమరుగైపోయి, మళ్ళీ ఇదిగో, ఇప్పుడిలా హాట్ కంటెంట్‌తో వస్తోంది.