Urvashi Rautela: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో క‌నిపించి క‌నిపించ‌న‌ట్టు అందాల ఆర‌బోత‌

Urvashi Rautela: ‘సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన అందాల ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌతెలా. ఈ సినిమాల‌లో చాలా రొమాంటిక్‌గా న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. వీలు చిక్కినప్పుడల్ల అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది.

మారుతున్న కాలాన్ని బట్టి ఫ్యాషన్‌ రంగంలో మార్పులు వ‌స్తున్నాయి. పొట్టి డ్రెస్సులు, చిరిగిన జీన్స్‌ వేసుకోవడమే స్టైల్‌ అయిపోయింది. ఇటీవ‌ల ఇదే స్టైల్‌లో రిప్‌డ్‌ జీన్స్‌ వేసుకున్న బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది.ఆమెను తెగ ట్రోలింగ్ చేశారు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రాములో 40 మిలియన్స్ ఫాలోవర్స్ తో న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆమె అందాల ఆర‌బోత‌కే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఉల్లిపొర లాంటి దుస్తులు ధ‌రించి అందాలు క‌నప‌డి క‌న‌ప‌డ‌కుండా చేస్తూ మ‌త్తెక్కిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.