Urvashi Rautela : రూ.190 కోట్లతో ఖరీదైన ఇల్లు కొన్న హీరోయిన్.. ఇంత సంపాదిస్తోందా…?
NQ Staff - June 2, 2023 / 10:30 AM IST

Urvashi Rautela : సెలబ్రిటీలు అంటేనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. ఖరీదైన ఇండ్లు, లగ్జరీ కార్లు, హై క్లాస్ లైఫ్ ఇవన్నీ వారి సొంతం. సినిమాల ద్వారా వారు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు సంబంధించిన న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఆమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.
ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై మోడల్ గా అవార్డులు కూడా అందుకుంది. ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. మధ్యలో క్రికెటర్ రిషబ్ పంత్ తో లవ్ ఎఫైర్ అంటూ వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది.
ఇందుకు అమ్మడు భారీగానే తీసుకుందంట. అయితే ఇప్పుడు ఊర్వశి రౌతేలా ఓలగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది. ముంబైలో కుబేరాలు నివసించే ఏరియాలో లగ్జీరి ఇంటిని ఆమె కొనుగోలు చేసింది. దీని ధర రూ.190 కోట్లు అంటున్నారు. బాలీవుడ్ బడా స్టార్లు నివసించే ఏరియాలో ఆమె ఇల్లు కొనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఫుల్ టైమ్ మోడల్ గా, పార్ట్ టైమ్ హీరోయిన్ గా చేస్తున్న ఊర్వశి రౌతేలా ఇంత ఎలా సంపాదించిందో ఎవరికీ అర్థం కావట్లేదు. వందల కోట్లతో ఇల్లు కొనడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ప్రస్తుతం ఆమె రామ్-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ముందు ముందు సౌత్ లో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉంది.