Urmila Matondkar : వణికిస్తున్న కరోనా.. బాలీవుడ్ నటికి పాజిటివ్
NQ Staff - November 1, 2021 / 09:33 AM IST

Urmila Matondkar : కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా బుసలు కొడుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కథానాయిక ఊర్మిళ మతోడ్కర్ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను.

Urmila Matondkar tests positive for COVID
ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. కొన్ని రోజులుగా నాకు సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేయించుకోండి. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోండి’’అని ట్వీటారు ఊర్మిళ. ఈ ట్వీట్ పై స్పందించిన అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా ఎలా సోకుతుంది అని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఊర్మిళ మాజీ కాంగ్రెస్ నాయకురాలు కాగా, గత ఏడాది డిసెంబర్లో శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం సతీమణి రష్మీ ఠాక్రే శివసేన కండువా కప్పి ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా.. ముంబై క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఊర్మిళ మద్దతుగా నిలిచారు. అలాంటి క్లిష సమయంలోనూ షారుక్ ఖాన్ తనలోని గౌరవం, దయ, పరిపక్వతను కోల్పోలేదని ఆమె కొనియాడారు.
షారుక్ ను చూస్తుంటే తానెంతో గర్వ పడుతున్నట్లు ఊర్మిళ మటోంద్కర్ తెలిపారు. అయితే కరోనా బారిన పడ్డ ఊర్మిళ త్వరగా కోలుకోవాలంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.