Uppena : ఉప్పెన సినిమాకి విజయ్ సేతుపతి ఆ రకంగా మైనస్ అయితే కష్టమే ..?

Uppena : ఉప్పెన సినిమా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. గత ఏడాది నుంచి ఈ సినిమా రిలీజ్ కాకుండా నిలిచిపోయింది. ఎట్టకేలకి ఓటీటీ వారు ఇచ్చిన భారీ ఆఫర్ ని కాదని కూడా మెగా హీరో డెబ్యూ సినిమా కావడం తో థియేటర్స్ రిలీజ్ కే డిసైడై ఉన్నారు. అనుకున్నట్టుగానే మేకర్స్ ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కి అనుమతులిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారీ హిట్ అందుకొని నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతుందని అంటున్నారు.

uppena-is vijaysetupathi going to become minus for this movie...?
uppena-is vijaysetupathi going to become minus for this movie…?

ఇప్పటికే ఈ సినిమా మీద ఏర్పడిన పాజిటివ్ టాక్ వల్ల డీసెంట్ కలెక్షన్స్ వస్తాయని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతుండగా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవి మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజై అందరి నుంచి ప్రశసంసలు అందుకుంది. దీంతో సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి.

Uppena : విజయ్ సేతుపతి కి మళ్ళీ డబ్బింగ్ చెప్పిస్తే ఎలా..?

అయితే ట్రైలర్ రిలీజయ్యాక అందరికీ అనిపిస్తుంది మాత్రం విజయ్ సేతుపతి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది అని. అది కూడా ఆయన వాయిస్ అని గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి చెప్పిన డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదని ట్రైలర్ చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా పెద్ద మైనస్ అవుతుందని చెప్పుకుంటున్నారు. కాని ఇది మేకర్స్ దృష్ఠికి వెళ్ళడం తో విజయ్ సేతుపతి కి మళ్ళీ డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారట. మరి ఇప్పటికే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి అది సాధ్యపడుతుందా లేదా చూడాలి.

Advertisement