Uppena : ఉప్పెన కృతిశెట్టి రెమ్యూనరేషన్ తో షాకులిస్తోందా ..?

Uppena : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమా మీదే ఉంది. అదే ఉప్పెన బ్యూటీకి బాగా ప్లస్ అయింది. ఒకే ఒక్క సాంగ్ తో కృతిశెట్టి దర్శక నిర్మాతలని హీరోలని ఆకట్టుకుంది. నీ కన్ను నీలి సముద్రం అన్న సాంగ్ కృతిశెట్టి లైఫ్ నే మార్చేసింది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్.. మైత్రీ మూవీ లాంటి బడా నిర్మాణ సంస్థ కావడం తో ఈ యంగ్ బ్యూటీ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే వరసగా టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి.

uppena-Is shocked with Krithishetti Remuneration ..?
uppena-Is shocked with Krithishetti Remuneration ..?

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యాం సింగ్ రాయ్ సినిమాలో కృతిశెట్టి ఒక హీరోయిన్ గా నటిస్తోంది. సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా కూడా కృతిశెట్టి కి మాత్రం బాగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే యంగ్ హీరో సుదీర్ బాబు తో ఒక సినిమా చేస్తోంది ఈ యంగ్ బ్యూటి. అఫీషియల్ గా కృతిశెట్టి చేతిలో మూడు సినిమాలున్నాయి. ఒక సినిమా రిలీజ్ కి ఉండగా రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి నటించిన ఉప్పెన ఫిబ్రవరి 12 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయితే అమ్మడి క్రేజ్ ఏ రేంజ్ కి చేరుకుంటుందో చెప్పలేము.

Uppena : మేకర్స్ క్యూ కడుతుంటే ఈ కుర్ర బ్యూటి రెమ్యూనరేషన్ తో షాకులివ్వక ఏం చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఒక సినిమాకి 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుందట. ఒక్క సినిమా రిలీజ్ కాకుండా ఏ హీరోయిన్ కి ఇంత క్రేజ్ రావడం చాలా అరుదు. ఈ విషయంలో ఈ యంగ్ బ్యూటి టాప్ అని చెప్పుకుంటున్నారు. ఇక కుర్ర హీరోలందరి చూపు కృతిశెట్టి మీదే ఉందని చెప్పుకుంటున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి నటించబోయే మూడవ సినిమాకి కృతి శెట్టి పేరే పరిశీలిస్తున్నారట. అలాగే అఖిల్ సినిమాకి ఈ యంగ్ బ్యూటీనే అనుకుంటున్నారట. ఈ రకంగా టాలీవుడ్ హీరోలు .. మేకర్స్ క్యూ కడుతుంటే ఈ కుర్ర బ్యూటి రెమ్యూనరేషన్ తో షాకులివ్వక ఏం చేస్తుంది అంటున్నారు.

Advertisement