Kamal: క‌మ‌ల్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌.. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది?

NQ Staff - November 24, 2021 / 06:11 PM IST

Kamal: క‌మ‌ల్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్‌.. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది?

Kamal: విలక్షణ నటుడు కమల్‌ హాసన్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

update on kamal health2

update on kamal health2

‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే… మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

క‌మ‌ల్‌కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్‌ క్లాత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్‌హాసన్‌ అమెరికా వెళ్లారు. ఆ స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డ్డారు. అలాగే ఈ సమయంలోనే సినీ ప్రముఖులు సహా అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరి ఇప్పుడు తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ బులెటిన్ బయటకి వచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ శ్రీరామ చంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారని తన పారామీటర్స్ అంతా కంట్రోల్ లోనే ఉన్నాయని అలాగే తన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని ఈ బులెటిన్ ద్వారా వైద్యులు తెలియజేసారు. ఇది కమల్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్త అని చెప్పాలి.

update on kamal health

update on kamal health

క‌మ‌ల్ ప్ర‌స్తుతం విక్ర‌మ్ సినిమాతో పాటు బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ కొన్నాళ్లు ఐసోలేష‌న్ లో ఉండాల్సి ఉన్న నేప‌థ్యంలో షోని ఎవ‌రు హోస్ట్ చేస్తార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us