Upasana : ఆర్ఆర్‌ఆర్ గురించి ఉపాసన.. విడుదల అయ్యి 220 రోజులైన అదే జోరు

NQ Staff - January 11, 2023 / 06:20 AM IST

Upasana : ఆర్ఆర్‌ఆర్ గురించి ఉపాసన.. విడుదల అయ్యి 220 రోజులైన అదే జోరు

Upasana : టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయి లో ఇప్పటికి కూడా సత్తా చాటుతూనే ఉంది. సినిమా విడుదల అయ్యి 220 రోజులు అయినా కూడా ఇంకా కూడా ఈ జోరు ఏంటో అంటూ ఉపాసన ఒక వీడియోను షేర్ చేసింది.

గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ లో ఉన్న నేపథ్యంలో అమెరికాలో ఈ సినిమా యొక్క స్క్రీనింగ్ జరిగింది. రాజమౌళితో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు చాలా మంది కూడా ఈ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. సినిమా స్క్రీనింగ్ సందర్భంగా ఆడియన్స్ రచ్చ చేశారు.

ముఖ్యంగా నాటు నాటు సాంగ్ వచ్చిన సమయంలో థియేటర్ మొత్తం కూడా కదిలింది. లేచి నిల్చుని కొందరు క్లాప్స్ కొడితే మరి కొందరు కూర్చుని చప్పట్లు కొడుతూ ఉన్నారు. మొత్తానికి నాటు నాటును తెగ ఎంజాయ్ చేశారు.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు కలిసి నటించిన ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. అజయ్‌ దేవగన్ కీలక పాత్రలో నటించాడు. సినిమా యొక్క జోరు విడుదల తర్వాత 220 రోజులు అయినా కూడా తగ్గలేదనే చెప్పాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us