Upasana: నిర్మాత‌గా మారుతున్న ఉపాస‌న‌.. హీరో ఎవ‌రో తెలుసా?

Upasana: మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి తెలుగు ప్ర‌జానికానికి చాలా సుప‌రిచితం. సోష‌ల్ మీడియాలా చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాస‌న ఆరోగ్యం విష‌యంలో ప్ర‌జ‌ల‌ని అప్ర‌మ‌త్తం చేస్తుంటుంది. ప్ర‌స్తుతం అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా మరియు బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌గా ఉన్న ఉపాస‌న యువ‌ర్ లైఫ్ వెబ్ పోర్ట‌ల్ నిర్వ‌హిస్తుంది. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు తెలియ‌జేస్తూ అంద‌రిని ఉత్తేజ‌ప‌రుస్తుంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి సమంత‌, ర‌కుల్, ర‌ష్మిక వంటి సెల‌బ్రిటీల‌ను కూడా తీసుకొచ్చి వారితో ప‌లు ర‌కాల వంట‌లు చేయించింది ఉప్సీ.

Upasana Produce Movie For Sharwanad
Upasana Produce Movie For Sharwanad

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. రోజుకు వేల కొల‌ది ప్రాణాలు కోల్పోతున్నా వైద్యులు మాత్రం మొక్క‌వోని ధైర్యంతో వైద్య సేవ‌లు చేస్తున్నారు. వీరి సేవ‌ల‌ను కొనియాడుతూ ఉప‌సాన ఓ షార్ట్ ఫిలిం చేయాల‌ని అనుకుంటుంద‌ట‌. విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బంది గురించి ఈ లఘు చిత్రంలో చెప్పబోతున్నారట. ఈ షార్ట్ ఫిలింకు మంచి ఆద‌ర‌ణ ద‌క్కాలంటే ఇందులో నోటెడ్ యాక్ట‌ర్‌ని తీసుకోవాల‌ని అనుకుంటుంది.

Upasana Produce Movie For Sharwanad
Upasana Produce Movie For Sharwanad

తాజా స‌మాచారం ప్ర‌కారం ఉపాస‌న నిర్మించ‌నున్న ల‌ఘు చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ లేదంటే ఆయ‌న చిన్న నాటి స్నేహితుడు శ‌ర్వానంద్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ని ఇన్‌సైడ్ టాక్. ఇప్ప‌టికే ఇద్ద‌రు స్టోరీ విన్నార‌ని టైంని బ‌ట్టి ఎవ‌రో ఒక‌రు ల‌ఘు చిత్రం చేసేందుకు సిద్దంగా ఉన్నార‌ని స‌మాచారం. శ‌ర్వానంద్ కొద్ది రోజుల క్రితం ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా,ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ‘మహాసముద్రం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అలానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించాడు శ‌ర్వా. ఇక మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పాన్ ఇండియా సినిమా చేయ‌నున్నాడు.