Upasana Konidela : నా తప్పు వల్ల మావయ్య చిరంజీవి చాలా బాధ పడ్డారు.. ఉపాసన కామెంట్లు వైరల్..!
NQ Staff - June 16, 2023 / 03:55 PM IST

Upasana Konidela : మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక హీరోయిన్ కు ఉండాల్సినంత ఫాలోయింగ్ ఆమె సొంతం. అయితే ఉపాసన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలతో మెగా కోడలు అంటే ఇలాగే ఉండాలి అనిపించుకుంది. కానీ ఆమె విషయంలో మాత్రం ఒకే ఒక్క బాధ ఉండేది మెగా ఫ్యామిలీకి.
అదేంటంటే.. రామ్ చరణ్-ఉపాసనకు పెళ్లి అయి పదేండ్ల వరకు పిల్లలు కాలేదు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ, చిరంజీవి చాలా బాధపడ్డారనేది వాస్తవం. కాగా తాజాగా ఉపసాన కూడా ఇదే విషయం మీద ఓపెన్ అయింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది. అందుకే ఇంటి నుంచి పెద్దగా బయటకు వెళ్లట్లేదు.
తాజాగా ఓ ఇంగ్లిష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. చరణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల విషయంలో మేం ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. మా కెరీర్ లో సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలని ఇంట్లో వారికి కూడా చెప్పాం. కానీ మా నిర్ణయంతో మావయ్య, అత్తయ్య చాలా బాధ పడ్డారు.
చాలా సార్లు మావయ్య మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి అంటూ చెప్పారు. ఆ విషయంలో ఆయన మాటలను మేం విస్మరించాం. అందుకు చాలా బాధగా ఉంది. ఆయన్ను బాధ పెట్టి మేం తప్పు చేశాం అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది ఉపాసన. ఇక ఎట్టకేలకు చిరంజీవికి కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతోంది ఉపాసన. ఈ విషయంలో చిరు చాలా హ్యాపీగానే ఉన్నారు.