Unstoppable Season2 : అన్ స్టాపబుల్ : చిరు, బాలకృష్ణలతో మల్టీస్టారర్, పాన్ వరల్డ్ మూవీ
NQ Staff - December 1, 2022 / 03:46 PM IST

Unstoppable Season2 : నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ ఈ వారం చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ఇప్పటికే మాట్లాడుకున్నాం. టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లతో పాటు ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు మరియు కోదండ రామిరెడ్డి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారు.
వీరితో నందమూరి బాలకృష్ణ మాట మంతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే కార్యక్రమంలో ఎన్టీఆర్ యొక్క శత జయంతి వేడుకను కూడా బాలకృష్ణ పనిలో పనిగా నిర్వహించాడు. రేపు స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ ప్రోమోలో బాలకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. చిరంజీవి, బాలకృష్ణలతో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు వెంటనే బాలకృష్ణ స్పందిస్తూ అది ఒక పాన్ వరల్డ్ మూవీ అవుతుందని కామెంట్ చేశాడు.
బాలకృష్ణ చేసిన కామెంట్ ఉద్దేశమేంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టేస్తోంది. బాలయ్య మరియు చిరంజీవి యొక్క కాంబినేషన్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అల్లు అరవింద్ కు ఇద్దరితో ఉన్న అనుబంధం నేపథ్యంలో వర్కౌట్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.