Posani Krishna Murali: పోసాని ఇంటిపై అర్ధ‌రాత్రి దాడి చేసిన దుండ‌గులు.. భ‌యంలో కుటుంబ స‌భ్యులు

Posani Krishna Murali: టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి .. టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు ప‌వ‌న్ . దీనికి స్పందనగా ఏపీ మంత్రులతో పాటుగా వైసీపీ మద్దతు దారుడిగా ఉన్న పోసాని సైతం స్పందించారు.

Unknown People attack with Stones on Posani Krishna Murali House
Unknown People attack with Stones on Posani Krishna Murali House

పవన్ పై సంచ‌ల‌న‌ ఆరోపణలు చేసారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత మరుసటి రోజున హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో తాను పవన్ పైన వ్యాఖ్యలు చేసిన తరువాత కొందరు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని..కంటిన్యూ ఫోన్లు చేస్తున్నారంటూ పోసాని చెప్పుకొచ్చారు.

ఆ సమావేశ సమయంలోనే పవన్ అభిమానులు .. జనసైనికులు పోసానిని అడ్డుకొనే అవకాశం ఉందని సమాచారం సేకరించిన పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున బందో బస్తు ఏర్పాటు చేసారు. ఇక, అదే ప్రెస్ మీట్ లో పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ పైన దూషణలకు దిగారు. వ్యక్తిగతంగా తిట్టడంతో పాటుగా కుటుంబ సభ్యుల పైనా దూషణలు చేసారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ అభిమానులు బుధ‌వారం అర్ధ‌రాత్రి పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేసిన‌ట్టు తెలుస్తుంది.

అయితే ఆ సమయంలో ఇంట్లో పోసానితో పాటు కుంటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పవన్‌ కల్యాణ్‌ అభిమానులే ఈ దాడికి పాల్పడ్డారని అక్కడి అపార్ట్‌మెంట్‌ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోసాని వాచ్‌మెన్ ఎస్సార్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి.