ఈ నైజిరియాన్ కుర్రోడి గురించి తెలుసా? తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే.

Advertisement

ప్రస్తుత ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ను ఇష్టాను రాజ్యంగా వాడుతున్నారు. ఇక అందులో పోస్ట్ చేసేటువంటీ మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మిమ్స్ లో వచ్చే కామెడీ ని అందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తు ఉంటారు . ఎక్కువగా మన తెలుగు హాస్యనటుల మిమ్స్ మనం చాలానే చూసే ఉంటాం . కానీ ఈ మధ్య కాలం లో నైజీరియన్ కి చెందిన ఓ కుర్రోడు ఈ మీమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు.తాను చేసే వింత నటన మరియు హావభావాలు కామెడీ గా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా లో అతగాడి పైన వచ్చే మీమ్స్ మరియు కామెడీ వీడియోలు బాగా నవ్వుని తెప్పిస్తూ ఉంటాయి . మన దగ్గరే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మీమ్స్ ద్వారా అందరికి పరిచయం అయ్యాడు ఈ పిల్లడు . ప్రతి ఒక్కరి సందేహం ఏంటంటే ఈ పిల్లోని పేరేంటి, ఈ పిల్లోడిది ఏ దేశం అని చాలా మంది అనుకుంటారు. కానీ మీరన్నట్టు ఇతగాడు పిల్లోడు కాదు. నడి వయస్కుడు . ఇక ఇతగాడి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇతని పేరు “ఓసీటా ఐహిమ్”.

ఐహిమ్ 1982 సంవత్సరం లో ఫిబ్రవరి 20 వ తేదీన నైజిరియా లోని నిబియా లో జన్మించాడు. అంటే ప్రస్తుతం ఇతనికి 38 సంవత్సరాల వయస్సు. ఐహిమ్ ఇనుగు స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాగోస్ లో చదువుకున్నాడు. మరి ఎందుకు ఇంత చిన్న వాడిలా ఉంటాడు అని సందేహం ఉండొచ్చు. అయితే ఈ ఐహిమ్ తన 12 సంవత్సరాల వయస్సులో జన్యు లోపం కారణంగా మరుగుజ్జు వ్యాధికి గురయ్యాడు. అందుకే ప్రస్తుతానికి చిన్న పిల్లోడిలా మరుగుజ్జు వలే కనిపిస్తూ ఉంటాడు ఐహిమ్.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించాడు ఐహిమ్. ఇక వాళ్ళ తల్లి దండ్రుల పేర్లు హెర్బర్ట్ ఐహిమ్ మరియు ఆగిస్టిన్ ఐహిమ్. ఇక ఓసీమా ఐహిమ్ సినీ రంగానికి 2003 లో ఎంట్రీ ఇచ్చాడు. ఒక్క సినిమాలే కాకుండా టీవీ షోలు కూడా పెద్ద ఎత్తున చేస్తుంటాడు. అంతే కాకుండా ఐహిమ్ నటనకు అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ లీడింగ్ రోల్ యాక్టర్ గా ఆఫ్రికా మూవీ అకాడమీ నుండి అవార్డు కూడా దక్కింది. అయితే మనకు హాస్యనటుడు బ్రహ్మానందం ఎంత హాస్యం పండిస్తాడో, ఆఫ్రికా దేశం లో ఐహిమ్ కూడా అక్కడి ప్రజలకు అంత గొప్పగా హాస్యాన్ని పండిస్తాడు. అంతే కాకుండా ఐహిమ్ చేసిన సినిమాలు మరియు టీవీ షోలు ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో డబ్బింగ్ అవుతున్నాయి. అలా డబ్బింగ్ అయ్యిన తన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరును ఐహిమ్ కి తెచ్చిపెట్టాయి ..

మరి ఐహిమ్ 38 సంవత్సరాల వయస్సు కదా పెళ్లి అయ్యిందా లేదా అనే సందేహం ఉండొచ్చు చాలా మందికి. కానీ తనకు పెళ్లి గురించి ఆలోచన అస్సలు లేదంట. అంతే కాదు తన ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. మన దేశ కరెన్సీ తో పోలిస్తే 250 కోట్ల పైనే ఉంటాయంట. ఈ ఓసీటా ఐహిమ్ కి వాళ్ళ దేశ అధ్యక్షుడు మరియు ఇతర ప్రముఖులు పాల్గొనే అన్ని కార్యక్రమాల ఆహ్వానాలు వస్తుంటాయంట.అంటే ఎంత గొప్ప పేరుందో తెలుస్తుంది కదా. చూసారుగా ఐహిమ్ తాను మరుగుజ్జు అని అస్సలు బాధ పడలేదు. తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించి ఇప్పుడు హాస్య చిహ్నంగా మన ముందు పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు పొందుతున్నాడు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీలో ఏదో లోపం ఉందని బాధపడుతూ కూర్చోకండి. మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ పక్క ఉంటుంది. అది బయట పెట్టండి. మీ సత్తా ఏంటో చుపెట్టండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here