Anuradha : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ అనురాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అంద చెందాలతో హుషారైన స్టెప్పులతో ఆమె మాస్ ఆడియన్స్ ను సైతం ఒక ఊపు ఊపేసేది. ఇక అలాంటి నటి అనురాధ తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే షకీలా తో కలిసి ‘ఆలీతో సరదాగా‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు గురించి చెప్పారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనురాధ అసలు పేరు సులోచన. మా అమ్మగారి ఊరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు. ఇక అనురాధ నాన్నగారు మహారాష్ట్రకి చెందినవారు. అనురాధ వాళ్ళ ఫ్యామిలీ చెన్నైలో సెటిలైన తరువాత ఆమె పుట్టినట్లు తెలిపారు. ఇక మొదటి నుంచి కూడా ఆమెకి నటనపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలిపారు. అనురాధ 5 భాషల్లో హీరోయిన్ గా 32 సినిమాల చేసినట్లు వెల్లడించారు. అయితే మలయాళం సినిమా చేస్తూ ఉండగా, దర్శకుడు కేజే జార్జ్ తన పేరును ‘అనూరాధ’గా మార్చినట్లు తేలిపారు. ఒకానొక సమయంలో వచ్చిన అవకాశాన్ని కాదనలేక నేను ఐటమ్ సాంగ్ చేయవలసి వచ్చింది. ఆ సాంగ్ సూపర్ హిట్ కావడంతో, అప్పటి నుంచి అదే తరహా పాటలు వచ్చాయి.. అవే చేసుకుంటూ వెళ్లవలసి వచ్చింది.
ఇక తన సినీ జీవితం తొలినాళ్లలో జయశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఒక తమిళ సినిమాలో ‘రండి .. కూర్చోండి’ అనే సింగిల్ డైలాగ్ ను ఆమె చెప్పలేక పోయినట్లు తెలిపింది. ఇక ఆ డైలాగ్ ను చెప్పడానికి 16 టేకులు తీసుకున్నాను .. జయశంకర్ ఆమెపై కోప్పడ్డారు. అలాంటి నేను ఆ తరువాత కాలంలో మూడు షిఫ్టులలో మూడు భాషలకి చెందిన సినిమాల షూటింగులో పాల్గొన్నట్లు తెలిపింది. అలా 1986లో 5 భాషల్లో కలుపుకుని నేను 87 సినిమాలు చేశాను. మొత్తంగా 700 సినిమాల వరకూ చేశాను. నా కెరియర్లోను ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. అయినా ఒక నటిగా నేను పెద్ద సక్సెస్ నే చూశాననే సంతోషం .. సంతృప్తి ఉన్నాయి” అని ఆమె చెప్పుకొచ్చారు.