Umair Sandhu : రవితేజ హీరోయిన్లను అసభ్యకరంగా టచ్ చేస్తాడు.. ఉమైర్ సంధు సంచలనం..!

NQ Staff - March 14, 2023 / 02:53 PM IST

Umair Sandhu : రవితేజ హీరోయిన్లను అసభ్యకరంగా టచ్ చేస్తాడు.. ఉమైర్ సంధు సంచలనం..!

Umair Sandhu  : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏకైక హీరో అంటే రవితేజ అనే చెప్పుకోవాలి. అందుకే ఆయనకు అంత మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి వివాదాలకు పోలేదు.

పైగా తన సినీ కెరీర్ లో ఆయన మీద ఇప్పటి వరకు పెద్దగా ఎలాంటి రూమర్లు రాలేదు. ఎఫైర్ వార్తలు కూడా రాలేదు. అయితే ఇప్పుడు మొదటి సారి ఆయన మీద రూమర్లు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో దుమారం రేగుతోంది.

కొత్త హీరోయిన్లతో..

Umair Sandhu Tweet Angers Ravi Teja Fans

Umair Sandhu Tweet Angers Ravi Teja Fans

ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ.. రవితేజ వల్ల ఆయన సినిమాలో నటించే హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన హీరోయిన్లను పట్టుకునే విధానం అస్సలు బాగోదు. ఆయన చాలా అసభ్యకరంగా హీరోయిన్లను టచ్ చేస్తాడు. దాంతో ఆయన సినిమాలో నటించాలంటే హీరోయిన్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు.

కొత్త హీరోయిన్లు అయితే నరకం అనుభవిస్తారు అంటూ సంచలన ట్వీట్లు చేశారు ఉమైర్ సంధు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలా ఎలా అంటావ్.. నువ్వు చూశావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us