Uday Bhanu : రీఎంట్రీలో అద‌ర‌గొడుతున్న సీనియ‌ర్ యాంక‌ర్.. త‌గ్గేదే లే అంటుందిగా..!

Uday Bhanu :ఒక‌ప్పుడు తన మాట‌ల తూటాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన యాంక‌ర్ ఉద‌య‌భాను త‌న యాంక‌రింగ్‌తో ఎంత‌గా అద‌ర‌గొట్టిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెర‌పై మెర‌వ‌డ‌మే కాదు, ప‌లు చిత్రాల్లో కూడా న‌టించింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ యాంకర్ అంటే ఉదయ భాను మాత్రమే కనిపించేది.

ఆమె కనిపిస్తే చాలు కుర్ర కారు ఉర్రూతలూగేవారు. అప్పట్లోనే హాట్ హాట్ గా స్పైసీ గా డ్రెస్ లు వేసుకుంటూ యాంకరింగ్ చేసి.. షోస్ ను తన ఇమేజ్ తో సక్సెస్ చేసేది ఉదయ భాను. ఇప్పుడంటే మనం స్టార్ యాంకర్ గా సుమను ఆకాశానికి ఎత్తుతున్నాం కాని.. ఒకప్పుడు బుల్లి తెరను ఏలిన మహారాణి మాత్రం ఉదయభానునే.

Udaya-Bhanu
UdayaBhanu

స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ షో అద్దిన ఉదయ భాను కోసమే షోలను చూసేవారు అంటే ఆమె ఎంత పాపులారిటీ సంపాధించుకుందో తెలుస్తుంది. రాను రాను కెరీర్ లో ఒడిదుడుకులు. ఫ్యామిలీ ప్రోబ్లమ్స్.. పెళ్ళి.. పిల్లలు.. ఇలా రకరకాల కారణాలతో కెరీర్ కు దూరమయ్యింది ఉదయభాను. చాలా కాలం స్క్రీన్ కు దూరంగా ఉన్న ఈస్టార్ యాంకర్.. ఇఫ్పుడిప్పుడే మళ్లీ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది. ఆఫర్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఉదయ భాను.

uday bhanu
uday bhanu

ఈ మధ్య మళ్లీ చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తుంది ఉదయభాను. కానీ గుర్తు పెట్టుకునే ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఇలాంటి సమయంలో మొన్న రిలీజైన‌ బాలయ్య అఖండ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌ సింగరాయ్ టీమ్‌తో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

Udaya-Bhanu
Udaya-Bhanu

ఇక తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభాను యాంకరింగ్ చేసింది. వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదు అని ఈమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు చూస్తే అర్థమవుతుంది. 50 ఏళ్లకు రెండు అడుగులు దూరంలో ఉన్న ఉదయ భాను మళ్ళీ స్క్రీన్ పై స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోగలదా లేదా చూడాలి