ముచ్చ‌ట‌గా మూడో సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్న సీఎం కోడ‌లు

సినిమా ఇండస్ట్రీ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. నటీనటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా తమ అనుభవాల్ని, ప్రతిభని, అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా ఎంతోమంది మహిళలు సైతం తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కోడలు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక ఇంతకు ముందు రెండు సినిమాలకు దర్శకత్వం చేశారు. తన భర్త నటించిన సినిమాలకు నిర్మాతగా ఉన్నారు.

Udayanidhi Stalin Wife Ready for one more movie Direction
Udayanidhi Stalin Wife Ready for one more movie Direction

అంతేనా ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకున్న కృతిక ఎన్నో సార్లు తాను డైరెక్ట్ చేసిన సినిమాలకు ప్రశంసలు అందుకున్నారు. ఈ సారి ఆమె తీయబోయే సినిమా కంప్లీట్ కమర్షియల్ వే లో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్నీ వివరాలు అందిస్తారని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. కృతిక ఉదయనిధి మూడో సినిమా పూర్తిగా రొమాంటిక్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాలో కాళిదాసు జయరాం, తాన్య రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అంతా అందమైన, అద్భుతమైన జర్నీగా సాగిపోతుందని, అలాంటి జర్నీలో లవ్ అనే బ్యూటిఫుల్ ఎలిమెంట్ ను తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా ఖచ్చితంగా యూత్ ని ఎంటర్ టైన్ చేస్తుందని తమిళ సినీ ఇండస్ట్రీ అంటుంది. ఈ మూడో సినిమాతో డైరెక్టర్ కృతిక మంచి పేరు దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు.

అలాగే తన భర్త ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఆమె ఓ సినిమా డైరెక్ట్ చేస్తే బావుంటుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. ఎంతైనా తమిళనాడు సీఎం కోడలు కావడంతో, ప్రేక్షకులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కమర్షియల్ హిట్స్ ను అందించాలని అనుకుంటున్నారట కృతిక.

మరి తన నాల్గవ సినిమా అయినా తన భర్తతో కలిసి సినిమాను తెరకెక్కిస్తారా లేదా అనేది చూడాలి. అలాగే ఆమె ఫోకస్ మొత్తం ప్రస్తుతం తన మూడో సినిమాపైనే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట.