Udaya Bhanu: పాత క‌ట్ట‌డాల మ‌ధ్య ఫొటోల‌కు ఫోజులిచ్చిన‌ ఉద‌య భాను..!

Udaya Bhanu: ఒక‌ప్ప‌టి స్టార్ యాంక‌ర్స్‌లో ఉద‌య భాను ఒక‌రు. సుమ‌తో పాటు పోటీగా టీవీ షోస్ చేసిన ఉద‌య భాను పిల్ల‌లు పుట్టాక కెరీర్ స్పీడ్ త‌గ్గించింది. కవల పిల్లలు పుట్టిన తర్వాత వారిని చూసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతూ ఉంటుంది.

Udaya Bhanu Stuns in Traditional Looks
Udaya Bhanu Stuns in Traditional Looks

బుల్లి తెరపై తెలుగు తొలి తరం యాంకర్‌గా ఉదయ భాను పేరు తెచ్చుకుంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యాంకర్స్‌ బుల్లి తెరపైకి రంగ ప్రవేశం చేశారు. పాపులారిటీతో పాటూ కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తల్లితో గొడవ, తన పర్సనల్ మేనేజర్ విజయ్ నే పెళ్లి చేసుకోవడం జరిగింది.
Udaya Bhanu Stuns in Traditional Looks
Udaya Bhanu Stuns in Traditional Looks

ప్ర‌స్తుతం పిల్ల‌ల ఆల‌నా పాల‌నా చూసుకుంటూ బిజీగా ఉంది ఉద‌య భాను. 2016లో ఆమెకు క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించ‌గా, ఆ పిల్లల పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర అని పెట్టుకుంది. . ఇద్దరు పిల్లలే తన ప్రపంచం అయిపోయింది. ఒకప్పుడు టీవీ షోలో ఫుల్ బిజీగా ఉండే యాంకర్ పిల్లలను చూసుకునేందుకు పెద్దగా ఈవెంట్స్ కూడా చేయడం లేదు.
Udaya Bhanu Stuns in Traditional Looks
Udaya Bhanu Stuns in Traditional Looks

తాజాగా ఈ అమ్మ‌డు పాత క‌ట్ట‌డాల మ‌ధ్య పట్టు చీరలో ముస్తాబై ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించిన ఉదయభాను, ఐటెం భామగా కూడా స్టార్స్ పక్కన కాలు కదిపారు. జులాయి మూవీలో అల్లు అర్జున్ తో ఆడిపాడిన ఉదయభాను ..రానా లీడ‌ర్‌లోను ఆడిపాడింది.