Uday Kiran: చ‌నిపోయిన ఏడేళ్ల త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ సినిమాకు మోక్షం..!

Uday Kiran: ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్‌గా, అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్నారు ఉద‌య్ కిర‌ణ్‌. చిత్రం సినిమా త‌ర్వాత మ‌ళ్లీ మ‌న‌సంతా నువ్వే చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఉద‌య్ కిర‌ణ్ వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు.

Uday Kiran Last Movie Release after 7 years
Uday Kiran Last Movie Release after 7 years

కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే ఉద‌య్ కిరణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న మ‌ర‌ణం ఎంద‌రినో బాధించింది. మంచి ఫ్యూచ‌ర్ ఉన్న వ్య‌క్తి ఇలా అర్ధాంత‌రంగా చ‌నిపోవ‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. అయితే ఉదయ్ కిర‌ణ్ చనిపోయే ముందు చిత్రం చెప్పిన క‌థ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు.

ఉద‌య్ కిర‌ణ్ చనిపోయిన ఏడేళ్ల త‌ర్వాత చిత్రం చెప్పిన క‌థ సినిమాకు మోక్షం క‌లిగేలా క‌నిపిస్తుంది. అయితే థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. నిజానికి 2020 ఫస్ట్ వేవ్ లో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ రేటు వర్కౌట్ అవ్వకో ఇంకా ఏదైనా కారణాల వలనో డీల్ సెట్ కాలేదు. ఈ సారి ఎలా అయిన చిత్రం చెప్పిన క‌థ మూవీని డిజిట‌ల్ మీడియాలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి కష్టంగా అభిమానులు కూడా చూస్తారని నమ్ముతున్నాయి ఓటిటీ సంస్థలు. 2013లో విడుదల కావాల్సిన చిత్రం చెప్పిన క‌థ‌ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండ‌డంతో మూవీపై అభిమానులు చాలా ఆస‌క్తి చూపుతున్నారు.

అయితే ఉద‌య్ కిర‌ణ్ మాదిరిగానే బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెష‌న్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం, ఆయ‌న న‌టించిన దిల్ బెచారా చిత్రం ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఉద‌య్ కిర‌ణ్ సినిమా కూడా మంచి స‌క్సెస్ సాధిస్తుంద‌ని అభిమానులు విశ్వ‌సిస్తున్నారు.