Raviteja : రవితేజ 68 కి ఇద్దరు యంగ్ బ్యూటీస్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ ..?

Raviteja : రవితేజ కెరీర్ లో తెరక్కబోతున్న సినిమా RT 68 ఇటీవలే ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి నేను లోకల్, సినిమా చూపిస్తా మావ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టిజి విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తర్వాత రవితేజ 68 ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు యంగ్ బ్యూటీస్ పేర్లు చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.

two young beauties for raviteja-68 movie
two young beauties for raviteja-68 movie

మలయాళ సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య మీనన్ ..అలాగే కన్నడ బ్యూటీ శ్రీలీలా లను రవితేజ 68 కి తీసుకునే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. కాగా ఐశ్వర్య మీనన్ ఇంతకుముందు లవ్ ఫెయిల్యూర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించగా.. శ్రీలీలా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్ళి సందడి సినిమా సీక్వెల్ ‘ పెళ్లి సందD ‘ లో నటిస్తుంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇంకా మేకర్స్ హీరోయిన్స్ ని అధికారకంగా ప్రకటించలేదు. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానుందని అంటున్నారు.

Raviteja : రవితేజ ఖిలాడి సినిమా నుంచి మహా శివరాత్రి పండుగ సందర్భంగా టీజర్ ని రిలీజ్..?

రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. మన మాస్ మహారాజ రవితేజ కి మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న భారీ సక్సస్ క్రాక్ సినిమాతో దక్కింది. దాంతో మంచి కం బ్యాక్ అయిన రవితేజ వరసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రవితేజ ఖిలాడి సినిమా చేస్తుండగా ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. డిపుల్ హయతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి మహా శివరాత్రి పండుగ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.

Advertisement