MAHESH BABU: ఫ్యాన్స్ కోసం రెండు స‌ర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్న మ‌హేష్‌.. ఇక అభిమానుల‌కు పూన‌కాలే!

MAHESH BABU సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమాల‌ కోస‌మే కాదు ఆయ‌న మూవీ అప్‌డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ప్ర‌స్తుతం మ‌హేష్ .. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణకు క‌రోనా బ్రేక్ వేసింది. దుబాయ్‌లో తొలి షెడ్యూల్ జ‌ర‌గగా, రెండో షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లో జ‌రుపుతున్నారు. అయితే సెట్‌లో కొందరికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో మూవీకి తాత్కాల‌కి బ్రేక్ వేసారు.

మూవీకి సంబంధించిన శుభ‌వార్త కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ విడుదలకానుందని ,అలానే టీజర్ ఆగస్టు 9 న అంటే మహేష్ పుట్టినరోజున విడుదల అవుతుందని తెలుస్తోంది. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం. చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Advertisement