SSMB 28: మ‌హేష్-త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌లో ఇద్ద‌రు యంగ్ బ్యూటీస్.. మ‌ళ్లీ ఆ బ్యూటీకే ఛాన్సిచ్చిన త్రివిక్రమ్

అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్టు మేక‌ర్స్ రీసెంట్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు.11 ఏళ్ల త‌ర్వాత మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌నే స‌రికి అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటుతుంది. అయితే ఈ సినిమా గురించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిందో లేదో మూవీకి సంబంధించిన అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఎన్టీఆర్ క‌థ‌ని మ‌హేష్ చేస్తున్నాడ‌ని, ఇందులో కథానాయిక‌లు వీరు అంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌హేష్ బాబు 28వ చిత్రం ఈ ఏడాది స‌మ్మ‌ర్ త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో పూజా హెగ్డే తొలి హీరోయిన్ కాగా, రెండో హీరోయిన్ దిశా ప‌టాని అని అంటున్నారు. ఇప్ప‌టికే పూజా హెగ్డే.. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో నటించ‌గా, ఇప్పుడు మూడో సారి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప‌ని చేయ‌నుంది. మ‌రోవైపు పూజా .. మ‌హేష్ స‌ర‌స‌న మ‌హ‌ర్షి అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ 28వ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లో రానుంది.

Advertisement