Shekar: 60 ఏళ్ల హీరోకి ఇద్ద‌రు కుర్ర భామ‌ల‌తో రొమాన్స్ అవ‌స‌ర‌మా!

Shekar: యాంగ్రీ యంగ్‌మెన్‌గా అభిమానుల‌చే పిలిపించుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ హీరో రాజ‌శేఖ‌ర్. పోలీస్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు పోషించారు. ఆయ‌న సినిమాల‌లో చాలా చిత్రాలు పెద్ద విజ‌యం సాధించాయి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌లో ఒకరిగా ఉండే రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ ఇచ్చారు. మ‌ళ్లీ గ‌రుగ వేగ చిత్రంతో స్పీడ్ పెంచాడు. గ‌రుడ వేగ చిత్రం రాజ‌శేఖ‌ర్‌కు పెద్ధ విజ‌యం అందించ‌డంతో ఆయ‌న మంచి క‌థాంశం ఉన్న సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజ‌శేఖ‌ర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వ‌చ్చిన క‌ల్కి చిత్రం కూడా మంచి విజ‌యమే సాధించింది.

Shekar

టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కథానాయకుడిగా లలిత్ దర్శకత్వంలో ఆయ‌న 91వ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి శేఖ‌ర్ అనే పేరు ఫిక్స్ చేయ‌గా, ఈ సినిమా లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవ‌కాశం ఉండ‌గా, ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ తో పాటు మరో నాయికగా మలయాళ భామ అను సితార ఎంపిక అయింది. కాగా, ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎమ్‌.ఎల్‌.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది.

Shekar

రాజ‌శేఖ‌ర్ వ‌య‌స్సు దాదాపు 60 ద‌గ్గ‌ర‌కు చేరుకుంది. ఈ 60 ఏళ్ల హీరో ఇప్పుడు ఇద్ద‌రు కుర్ర‌భామ‌ల‌తో ఆడిపాడ‌నుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ వంటి స్టార్స్ న‌య‌న‌తార‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ వంటి సీనియర్ భామ‌ల‌ని ఎంపిక చేసుకుంటుండ‌గా, రాజ‌శేఖ‌ర్ మాత్రం కుర్ర భామ‌లని ఎంపిక చేసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇప్పుడు ఆయ‌న త‌న‌య‌లు కూడా ఇండ‌స్ట్రీలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. శివాని- శివాత్మిక ఇప్ప‌టికే వెండితెర ఆరంగేట్రం చేయ‌గా, ఇద్ద‌రు డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.