BIGG BOSS : బిగ్ బాస్ సీజ‌న్ 5లో టీవీ 9 యాంక‌ర్.. ఆమె బ్యాక్ గ్రాండ్ తెలుసా?

BIGG BOSS : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న‌బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఈ కార్య‌క్ర‌మం నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఐదో సీజ‌న్‌కు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న కాస్త లేట్‌గా ప్రారంభ‌మైన బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఈ ఏడాది జూన్‌లో మొద‌లు కానుంద‌ని అంటున్నారు . అయితే ఈ షోలో పాల్గొనే వారికి సంబంధించి లీకుల ప‌ర్వం కొన‌సాగుతూ వ‌స్తుంది. తాజాగా టీవీ 9 యాంక‌ర్ ప్ర‌త్యూష బిగ్ బాస్ సీజ‌న్ 5లో అడుగుపెట్ట‌బోతుంద‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తుంది. ప్ర‌తి సీజ‌న్‌లో టీవీ 9 యాంక‌ర్స్ ఎవ‌రో ఒక‌రు బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేస్తుండ‌గా, ఈ సారి ప్ర‌త్యూష వ‌స్తుంద‌ని అంటున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 1 మిన‌హాయిస్తే రెండో సీజ‌న్‌లో టీవీ 9 నుండి దీప్తి న‌ల్ల‌మోతు, మూడో సీజ‌న్‌లో జాఫ‌ర్, నాలుగో సీజ‌న్‌లో దేవి నాగ‌వ‌ల్లి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు.ఈ ముగ్గురిలో దీప్తి న‌ల్ల‌మోతు కొన్ని ఎక్కువ రోజులు హౌజ్‌లో ఉంది. అయితే దేవి నాగ‌వ‌ల్లికి ఆడియ‌న్స్ భారీగానే ఓట్స్ వేస్తున్న‌ప్ప‌టికీ యాజ‌మాన్యం కావాల‌ని ఆమెను పంపించంద‌నే ప్ర‌చారం అప్పుడు న‌డిచింది. క‌ట్ చేస్తే సీజ‌న్ 5కు ప్ర‌త్యూష రాబోతుంద‌నే టాక్ న‌డుస్తుంది. అందంగా ఉండే ప్ర‌త్యూష సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం, వినోదాత్మ‌క కార్య‌క్ర‌మాల‌తో అల‌రించ‌డం చేస్తుంది.

ప్ర‌త్యూష ఎంట్రీ ఈ సారి క‌న్‌ఫాం అనే టాక్ అయితే న‌డుస్తున్న‌ప్ప‌టికీ పూర్తి క్లారిటీ మ‌రి కొద్ది రోజుల‌లో రానుంది. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 5లో యూట్యూబ్ సంచ‌ల‌నం ష‌ణ్ముఖ్ జ‌స్వంత్, బమ్ చిక్ బబ్లూ.. హెచ్ ఎం టీవీ యాంకర్ రోజా.. టిక్ టాక్ స్టార్ మహాతల్లి, యాంక‌ర్ ర‌వి వంటి సెల‌బ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. వీరి స‌ర‌స‌న ప్ర‌త్యూష నిలుస్తుందా లేదా అనే దానిపై కొద్ది రోజులు వేచి చూడాలి. ప్ర‌త్యూష స్వస్థలం తూ.గో జిల్లా తుని . కళాకారుల ఫ్యామిలీ నుంచి వచ్చి టీవీ న్యూస్ ప్రెజెంటర్ గా అల‌రిస్తుంది.

Advertisement