Sneha Jain: రోజంతా గ‌డ‌పాల‌ని కండీష‌న్ పెట్టాడు.. సౌత్ డైరెక్ట‌ర్‌పై న‌టి సంచ‌ల‌న కామెంట్స్

Sneha Jain: సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు తార‌లు కాస్టింగ్ కౌచ్ బారిన ప‌డ‌గా, ఒక్కొక్క‌రు త‌మ‌కు గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాల‌ని వివ‌రిస్తూ వ‌స్తున్నారు. త‌మ జీవితంలో ఎలాంటి చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయో తెలియ‌జేస్తూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల ప్ర‌వ‌ర్త‌న గురించి ఓపెన్ కాగా, తాజాగా దక్షిణాదికి చెందని ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ముంబయి నటి స్నేహా జైన్‌ ఆరోపించారు.

TV actress Sneha Jain claims: A South director asks me to compromise – Casting Couch
TV actress Sneha Jain claims: A South director asks me to compromise – Casting Couch

న‌టి స్నేహా జైన్ ప్ర‌స్తుతం ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’ ధారావాహికలో నటిస్తుంది. ఈ క్ర‌మంలో ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్స్‌ విషయాలు బయటపెట్టారు. కెరీర్‌ ఆరంభంలో తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని అన్నారు. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు తనతో ఫోన్‌లో చాలా అసభ్యంగా మాట్లాడాడని.. రోల్‌ కావాలంటే అన్నింటికీ ఒప్పుకోవాలన్నాడని ఆమె తెలిపారు.

‘నేను పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడి నుంచి నాకు ఒక ఆఫర్‌ వచ్చింది. కాలేజ్‌ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలో నాకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు. అందులో మూడు జోడీలుంటాయని.. అందరివీ ప్రాధాన్యం ఉన్న పాత్రలేనని ఆయన అన్నాడు. దాంతో నా వివరాలు, ఫొటోలను ఆయనకు పంపించాను.

ఆ తర్వాత రోజు ఆయన నాకు ఫోన్‌ చేసి హైదరాబాద్‌కు రమ్మని చెప్పారు. అంతేకాకుండా, పారితోషికంలో సగం సినిమాకి ముందు ఇచ్చేస్తామని.. మిగతాది సగం షూట్‌ అయ్యాక ఇస్తామని అన్నాడు. దానికి నేను, అంగీకరించాను. అదే సమయంలో, ఒకరోజంతా తనతోనే గడపాలని.. దేనికైనా ఓకే చెప్పాలన్నాడు. ఆ మాటకు నేను షాక్‌ అయ్యాను. నేను అలాంటివి చేయనని చెప్పేశాను.

వారం రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఫోన్ చేసి, ఇలాంటివి కామ‌న్.నీకు మంచి ఆఫ‌ర్ ఇస్తున్నాం. నువ్వు ఓకే అను చాలు అంటూ చెప్పుకొచ్చాడు.అది విని నేను గ‌ట్టిగా అరిచి ఫోన్‌ పెట్టేశాను’ అని స్నేహా వివరించారు.