Tuck Jagadish: ఎమోష‌న్స్‌తో పాటు యాక్ష‌న్‌తో కూడిన ట‌క్ జ‌గ‌దీష్ ట్రైల‌ర్

Tuck Jagadish: నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం వివాదాల చుట్టూ న‌డిచిన విష‌యం తెలిసిందే.థియేట‌ర్‌లో అని ఎగ్జిబిట‌ర్స్, ఓటీటీలో అని నిర్మాత‌లు ట‌క్ జ‌గ‌దీష్‌పై డ్రామా న‌డిపారు. ఎట్ట‌కేల‌కు ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. సెప్టెంబ‌ర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌గా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Tuck Jagadish Trailer Includes Both Action and Emotions
Tuck Jagadish Trailer Includes Both Action and Emotions


భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి’ అనే సంభాషణతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ యాక్షన్‌, భావోద్వేగ సన్నివేశాలతో విశేషంగా ఆకట్టుకుంటుంది. నానిని ప‌రిచ‌యం చేసే షాట్స్ .. జ‌గ‌పతి బాబు, నాని మ‌ధ్య సాగే సంభాష‌ణ‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ట్రైల‌ర్ మొత్తం ఎమోష‌న్స్‌తో పాటు యాక్ష‌న్స్‌తో కూడా ఉంది.


అస‌లు భూదేవిపురం కథేంటి? టక్‌ జగదీష్‌ అనుకున్నది సాధించాడా? తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి.


షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ట‌క్ జ‌గ‌దీష్‌ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. గ‌త ఏడాది వి చిత్రంతో ఓటీటీలో ప‌ల‌క‌రించిన నాని ఈ ఏడాది ట‌క్ జ‌గ‌దీష్‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వి చిత్రం అభిమానుల‌కు నిరాశ‌ప‌చంగా, ఈ సినిమా ఎలాంటి వినోదం అందిస్తుందో చూడాలి.