Tuck Jagadish నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం టక్ జగదీష్. నిన్నుకోరి చిత్రం తర్వాత ఈ కాంబినేషన్లో టక్ జగదీష్ రూపొందుతుంది. రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఫిబ్రవరి 24న నాని బర్త్‌డే కాగా, ఈ సందర్భంగా ఒక రోజు ముందే టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే నాని చిత్రం ప్రేక్షకులకు మాంచి వినోదాన్ని తప్పక అందిస్తుదనిపిస్తుంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్ని హంగులు సినిమాలో ఉంటాయని టీజర్‌ని బట్టి అర్ధమవుతుంది.
ఇప్పటికే టక్ జగదీష్ ఫస్ట్ లుక్, ఇతర అప్ డేట్లు నాని స్క్రీన్ పెర్ఫార్మెన్స్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇప్పుడు టీజర్ కూడా చితక్కొట్టింది. మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీశ్ పెద్ది, గారపాటి సాహు నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.