Tuck Jagadish: ట‌క్ జ‌గ‌దీష్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్.. ఖుష్ అవుతున్న నాని ఫ్యాన్స్

Tuck Jagadish: నేచుర‌ల్ స్టార్ నానికి క‌రోనా పెద్ద దెబ్బే వేసింది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న నాని న‌టించిన సినిమాల‌న్నీ ఓటీటీ బాట ప‌డుతున్నాయి. వి చిత్రం ఏడాది మొద‌ట్లో ఒటీటీలో విడుద‌ల కాగా, టక్ జగదీష్ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమాను మొదట థియేటర్లోనే విడుదల చేయాలని భావించిన‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల‌న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేశారు.

Tuck Jagadish Movie New Record
Tuck Jagadish Movie New Record

సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డం మంచిదైంది. ఎందుకంటే సినిమా అంతగా నచ్చలేదని థియేటర్ లోకి వచ్చి ఉంటే చాలా ఎక్కువగా నష్టపోయేదని కూడా అంటున్నారు. ఓటీటీ వ‌ల‌న‌ నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ దక్కినట్లు తెలుస్తోంది. 2017 లో మిడిల్ క్లాస్ అబ్బాయి అనంతరం నాని ఎక్కువగా కమర్షియల్ విజయాన్ని అందుకోలేదు. ఆ తరువాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం నిరాశ‌పరిచాయి.

నాని వి సినిమాను నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ గా విడుదల చేయడం ఇష్టం లేక అమెజాన్ ప్రైమ్ కు భారీ ధరకు అమ్మేశాడు. ఒక విధంగా సినిమా పెట్టిన పెట్టుబడినికి నాన్ థియేట్రికల్ గానే లాభాలను అందించింది. రీసెంట్ గా విడుదలైన టక్ జగదీష్ సినిమా కూడా మంచి లాభాలను అందించింది. టక్ జగదీష్ సినిమా కోసం దాదాపు 34 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. ఇక అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మొత్తం 37 కోట్లకు కొనుగోలు చేసింది.

శాటిలైట్ హక్కులను బయట అమ్ముకోవడంతో నిర్మాతలకు మరొక 7.5 కోట్లు లాభంగా వచ్చాయి. ఆడియో రైట్స్ ద్వారా మరొక రెండు కోట్లు రాగా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా ఐదు కోట్లు లాభం వచ్చింది. మొత్తంగా ఈ సినిమా యాభై 51.5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే 34 కోట్ల బడ్జెట్ పెడితే ఆ పెట్టుబడికి నిర్మాతలకు 17 కోట్ల వరకు లాభం వచ్చింది. ఇక ఈ సినిమా కొత్త రికార్డ్ సాధించింది. ప్రైమ్ వీడియోలో వీక్షించిన తెలుగు సినిమాల‌లోట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని ఎక్కువ మంది చూశార‌ట‌. ఈ వార్త విన్న నాని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.