Nani: 2013 నాటి విష‌యాలు బ‌య‌ట‌కు తీసి నానిపై ట్రోలింగ్.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్

Nani: విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో నేచుర‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. వివాదాల‌కు దూరంగా ఉండే నాని ఇటీవ‌లి కాలంలో విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నాడు. టక్ జగదీష్ విషయంలో తెగ ట్రోలింగ్ జరిగింది.చిత్రాన్నిఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ని తెగ ట్రోల్ చేశారు. ఈ నేప‌థ్యంల‌ నాని వివరణ కూడా ఇచ్చారు.

Trolls on Hero Nani with his Old Tweets
Trolls on Hero Nani with his Old Tweets

ప్ర‌స్తుతం నాని సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా ఆయన పాత ట్వీట్స్ అంటే ఎనిమిదేళ్ల క్రితంవి 2013 నాటికి బయిటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. ట్వీట్స్ ప్రో మోడికు సంభందించినవి, మరికొన్ని స్టేట్ బైపరకేషన్ కు సంభందించినవి తీసి ట్రోల్ చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. ఆ ట్వీట్స్ అన్ని ఇప్పుడు రీట్వీట్స్ చేస్తూ మాక్ చేస్తున్నారు.

పాత ట్వీట్స్ ని ఇప్పుడు బయిటకు తీసి అప్పటి అభిప్రాయాలను ఇప్పటిలా చెలామణి చేయటం ఎంతవరకూ సమంజసం అంటున్నారు నాని అభిమానులు. ఏడేళ్లలో చాలా అభిప్రాయాలు మారతాయి అని చెబుతున్నారు. నాని న‌టించిన టక్ జగదీష్ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి.

శ్యామ్ సింగ్ రాయ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోని డిసెంబ‌ర్‌లో విడుద‌లయ్యేందుకు సిద్ధ‌మైంది. ఇక నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వ‌స్తున్న‌ చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ హీరోయిన్. పూర్తి తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.

విజయదశమి పండగ సందర్భంగా విడుదల చేసిన ‘సైరెన్‌ ఆఫ్‌ దసరా’లో ‘జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసింగాలైతై సూస్‌కుందాం’ అంటూ నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.