Anasuya: పొట్టి దుస్తుల్లో వ్యాక్సినేషన్.. అనసూయపై విప‌రీత‌మైన‌ ట్రోలింగ్

Anasuya: అనసూయ భరద్వాజ్.. యాక్టింగ్, యాంకరింగ్ లతో బిజీగా గడిపేస్తుంటుంది. సోషల్ మీడియాలో నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. అలాగే కాంట్రవర్సీలకు తెరలేపుతూ ఉండే ఈ బ్యూటీ ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తన ప్రొఫెషనల్ విశేషాలతో పాటు, పర్సనల్ యాక్టివీటీస్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

Trolls on Anasuya Vaccination
Trolls on Anasuya Vaccination

సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ అప్ లోడ్ చేసే ఫోటోలు అందర్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. అయితే హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయపై నెటిజన్లు ఎప్పుడూ మండిపడే కామన్ పాయింట్ ఒక్కటే.. తన డ్రస్సింగ్ స్టైల్.. పొట్టి పొట్టి బట్టలతో ఉండే అనసూయను నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు.

ఇలాంటి కమెంట్స్ భరించలేక అనసూయ చాలా సిట్యూవేషన్స్ లో రివర్స్ కౌంటర్స్ వేయడంతో పాటు ఆ వ్యక్తుల్ని బ్లాక్ చేస్తుంటారు. అనసూయ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పటికప్పుడూ ఫాలోయింగ్ ను పెంచుకుంటూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా అనసూయ తన భర్తతో కలిసి వ్యాక్సిన్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేశారు. గతంలో ఓ నెటిజన్, అనసూయను వ్యాక్సిన్ వేసుకున్నారా.. అని అడగ్గా తనకు 45 సంవత్సరాలు రాలేదని కౌంటర్ వేశారు.

అయితే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో వాక్సినేషన్ డ్రైవ్ లు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ కూడా వ్యాక్సిన్ వేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నప్పుడు తన భర్త చేతిని గట్టిగా పట్టుకుని తెగ భయపడ్డారు. మొత్తానికి తాను వ్యాక్సిన్ వేయించుకున్నానని.. నెక్ట్స్ సెకండ్ డోస్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ కి నెటిజన్లు పొట్టి బట్టల్లో అనసూయ వ్యాక్సిన్ వేయించుకుంది అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆఖరికి వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు కూడా అనసూయ తన డ్రస్సింగ్ స్టైల్ మార్చుకోదా అంటున్నారు నెటిజన్లు. ఇక ఆమె కెరీర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. పుష్ప సినిమాలో అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మమ్ముట్టి సినిమా షూటింగ్ లో కూడా అనసూయ ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే.