Sushmita Sen : సుస్మితా సేన్‌పై ట్రోలింగ్.! ముసలాడితో అలా.. కుర్రాడితో ఇలా.!

NQ Staff - August 30, 2022 / 07:20 PM IST

155895Sushmita Sen : సుస్మితా సేన్‌పై ట్రోలింగ్.! ముసలాడితో అలా.. కుర్రాడితో ఇలా.!

Sushmita Sen : సుస్మితా సేన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? తెలుగులో అక్కినేని నాగార్జున సరసన ‘రక్షకుడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే, తరచూ సుస్మితా సేన్ పేరు మాత్రం వార్తల్లో వుంటూ వస్తోంది.

బాలీవుడ్‌లో చేస్తోన్న సినిమాల వల్ల కాదు. అనేక రకాల వివాదాల కారణంగా. మొన్నామధ్య లలిత్ మోడీతో సుస్మితా సేన్ పెళ్ళంట.. అంటూ వార్తలొచ్చిన విషయం విదితమే. తమ మధ్య ప్రస్తుతానికి స్నేహం మాత్రమే వుందనీ, త్వరలో తాము వైవాహిక బంధంతో ఒక్కటయ్యే రోజు వస్తుందనీ లలిత్ మోడీ ప్రకటించాడు.

కన్ఫామ్ చేసిన సుస్మితా సేన్.. ఇంతలోనే.!

Trolling Sushmita Sen On Social Media

Trolling Sushmita Sen On Social Media

తన కంటే వయసులో చాలా చిన్నవాడైన రోష్మన్ షాల్‌తో కొన్నాళ్ళ క్రితం వరకూ సహజీవనం చేసింది సుస్మితా సేన్. ఆ బంధం కూడా కొన్నాళ్ళ క్రితమే తెగిపోయింది. ఆ తర్వాత లైన్లోకి లలిత్ మోడీ వచ్చాడు. కానీ, ఏమయ్యిందో.. లలిత్ మోడీ సైడ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయి.. మళ్ళీ రోష్మన్ షాల్ మెయిన్ లైన్‌లోకి వచ్చేశాడు.

ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా బోల్డంత ట్రోలింగ్ జరుగుతోంది. ముసలాడితో ఎందుకు దండగ.. కుర్రాడితోనే అసలు పండగ.. అంటూ సుస్మితా సేన్ మీద కామెంట్లేస్తున్నారు నెటిజన్లు. సుస్మిత జీవితంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు.. ఎన్నో ఎఫైర్స్.. ఎన్నెన్నో సహజీవనాలు.. సో, ఆమెకు ఈ ట్రోలింగ్ పెద్ద కష్టమేమీ కాదు. అన్నట్టు, పెళ్ళి కాకుండానే ఇద్దరమ్మాయిలకు తల్లి అయ్యింది సుస్మితా సేన్. ఆగండాగండీ, ఆమె వారిని పెంచుకుంటోంది.!