Trivikram: సుమ‌ని హ్యాండిల్ చేయ‌డం చిరు వ‌ల్ల కాలేదు కాని ఆయ‌న వ‌ల్ల అవుతుంది: త్రివిక్ర‌మ్

Trivikram: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాల‌లో ఎంత ప‌దునైన మాట‌లు రాస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన స్పీచ్‌లో కూడా అంత ప‌వ‌ర్ ఉంటుంది. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచింపజేసే విధంగా మాటల బాణాలను వదులుతుంటారు. ఇక రీసెంట్ గా సుశాంత్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో మరోసారి తన స్పీచ్ తో అదరగొట్టారు.


Trivikram Says That Only Chiru Can Handle Suma
Trivikram Says That Only Chiru Can Handle Suma


ఎప్పుడు సుమ అందరిపై పంచ్‌లు వేసి ఆక‌ర్షిస్తుంటే ఈ సారి సుమ పైనే త్రివిక్ర‌మ్ త‌నదైన స్టైల్‌లో పంచ్‌లు వేసి న‌వ్వించారు. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి త్రివిక్రమ్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఈ క్ర‌మంలో సుశాంత్ న‌టించిన సినిమాకు చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు త్రివిక్ర‌మ్.

ఓ వైపు సినిమా గురించి మాట్లాడుతూనే మరో వైపు నటీనటుల పై తనదైన శైలిలో కామెడీ పంచులు వేశారు త్రివిక్ర‌మ్. చాలా రోజుల తర్వాత సినిమా ఫంక్షన్ లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇండియా మొత్తంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో థియేటర్ కి రావడానికి సాహసం చేస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. నాకు సుశాంత్ ఈ సినిమా చేస్తున్నాడు అని అలా వైకుంఠపురములో షూటింగ్ టైమ్ లోనే చెప్పాడు. చాలా సందర్భాల్లో కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అన్నాడు. అతని మొహంలోనే నాకు సక్సెస్ కనిపించింది అని అన్నారు త్రివిక్ర‌మ్.

ఇక ఓ సంద‌ర్భంలో అభినవ్ గోమటం గురించి మాట్లాడుతూ ట్రైలర్ అంటే తెలుగులో ప్రచార చిత్రాన్ని ప్రజలలోకి వదిలేయడం. మళ్లీ చిట్టి చిత్రం అంటే అది షార్ట్ ఫిలిం అవుతుందని అతనికి చెప్పినట్లు స్టేజ్ పైన త్రివిక్రమ్ మాట్లాడారు. మీరు చిట్టి చిత్రం అంటే సుమ గారు మిమ్మల్ని ర్యాగ్ చేసే అవకాశం ఉంది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి చిరంజీవి లాంటి వారే స్టేజిపైకి వచ్చే ముందు ఏం మాట్లాడాలో చదువుకొని ఎక్కుతారు.

అంటే ఆయ‌న కూడా అంత జాగ్రత్తగా ఉంటారు. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారే సుమను హ్యాండిల్ చేయగలరు. ఏదేమైనా సుమ గారిని చాలా రోజుల తర్వాత స్టేజ్ పైన ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది.ఇలానే చిత్ర ప‌రిశ్ర‌మ మ‌రింత ముందుకు సాగాల‌ని కోరుకుంటున్నాన అని త్రివిక్ర‌మ్ స్ప‌ష్టం చేశారు.