Trivikram : భీమ్లా నాయ‌క్ కోసం త్రివిక్ర‌మ్ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడో తెలుసా?

Trivikram : టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్స్‌లో భీమ్లా నాయ‌క్ ఒక‌టి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుద‌ల కాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతుంది భీమ్లా నాయక్.

TheNewsQube-
Trivikram remuneration for pawan kalyan bheemla nayak movie
Trivikram remuneration for pawan kalyan bheemla nayak movie

మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. నిజానికి భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సినిమా మేకింగ్ లో దర్శకుడు సాగర్ కే చంద్ర పాత్ర నామమాత్రమేనన్న మాట వినిపిస్తుంది.

Trivikram remuneration for pawan kalyan bheemla nayak movie
Trivikram remuneration for pawan kalyan bheemla nayak movie

ఒరిజినల్ కథకు పవన్ ఇమేజ్ కోసం అనేక మార్పులు చేశారు. మలయాళ క్లాసిక్ హిట్ ని కమర్షియల్ సినిమాగా మార్చేస్తున్నారు. పవన్, రానా మధ్య సాగే ఆధిపత్య పోరే.. భీమ్లా నాయక్ స్టోరీ. కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ కావలసిందే. భీమ్లా నాయక్ నిర్మాతలు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయలు త్రివిక్రమ్ కి ఇస్తున్నారట.

దానితో పాటు లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా ఆయనకు ఉందట. ఓ పూర్తి స్థాయి చిత్రానికి దర్శకత్వం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే అధికంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి తీసుకుంటున్నారట. రాజమౌళి మినహాయిస్తే టాలీవుడ్ లో ఓ ఒక్క డైరెక్టర్ కూడా రూ. 15 కోట్లకు మించి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అలాంటిది భీమ్లా నాయక్ ద్వారా త్రివిక్రమ్ అంతకు మించి ఆర్జిస్తున్న ట్లు సమాచారం.

చివ‌రిగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో మంచి హిట్ కొట్టిన త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జ‌రుపుకుంటుంది.