Nithin : నితిన్ సినిమాకి గురూజీ ఫుల్ సపోర్ట్..!

Nithin : నితిన్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో అని అందరికీ తెలిసిందే. నితిన్ ప్రతీ ఒక్కరితో చాలా క్లోజ్ గా ఉంటాడు. ఇక మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ని గురువుగా ఎంత గౌరవిస్తాడో అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డై హార్ట్ ఫ్యాన్. నితిన్ చేసే ప్రతీ సినిమాల కథలను ఈ ఇద్దరితో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాడు నితిన్. అందుకే నితిన్ అంటే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, ఇటు త్రివిక్రం శ్రీనివాస్ కి ప్రత్యేకమైన అభిమానం. నితిన్ అడగాలే గానీ పవర్ స్టార్, త్రివిక్రం వెంటనే సినిమా ఈవెంట్స్ కి వచ్చేందుకు ఒకే చెప్పేస్తారు.

trivikram-full-support-for-nithin-movie
trivikram-full-support-for-nithin-movie

గత ఏడాది నితిన్ – రష్మిక మందన్న నటించిన భీష్మ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రంగ్ దే సినిమా కి అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమాని యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. త్రివిక్రం కి అత్యంత సన్నిహితమైన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఈ సినిమా మార్చ్ 26న రిలీజ్ కాబోతోంది.

Nithin : పవర్ స్టార్ సడన్ సర్‌ప్రైజ్ ఏమైన ఇస్తారేమో…?

ఈ క్రమంలో నితిన్ రంగ్ దే సినిమా ప్రమోషన్స్ ని బాగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని బాగా ఆకట్టుకుంది. అంతేకాదు సినిమా మీద భారీగా అంచానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రంగ్ దే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సినిమాకి గురూజి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అధికారకంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించారు. చూడాలి మరి ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ సడన్ సర్‌ప్రైజ్ ఏమైన ఇస్తారేమో.

Advertisement