Trisha: జీవితంలో తొలిసారి నెగెటివ్ అనే ప‌దం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో..: త్రిష‌

Trisha: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం వ‌ణుకు పుట్టిస్తుంది. సినిమా, రాజ‌కీయం, క్రీడా ప్రముఖులు అనే బేధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా సోకుతుంది. ఇప్ప‌టికే మ‌హేష్‌, ల‌క్ష్మీ మంచు, విష్వ‌క్ సేన్, మంచు మ‌నోజ్‌, త‌మ‌న్, స‌త్య‌రాజ్, త్రిష‌, కీర్తి సురేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇందులో స‌త్య‌రాజ్, థ‌మ‌న్ ఇప్పటికే కోలుకోగా తాజాగా త్రిష కూడా త‌ను క‌రోనా నుండి కోలుకున్న‌ట్టు తెలియ‌జేసింది.

trisha tested corona negative2
trisha tested corona negative2

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ త్రిష త‌న‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్‌ సోకిందని తెలిపారు త్రిష. వైరస్‌ నుంచి వేగంగా కోలుకుంటున్నానని.. అంతేకాదు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నానని.. దీని వల్లే త్వరగా కోలుకుంటున్నాని వ్యాక్సిన్ వల్ల మేలు జరిగిందని పేర్కోన్నారు త్రిష‌.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న త్రిష త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు తెలిపింది. జీవితంలో తొలిసారి నెగెటివ్ అనే పదాన్ని చదివినప్పుడు చాలా ఆనందం వేసిందని చెప్పుకొచ్చిన త్రిష.. దాదాపు 10 రోజుల తర్వాత కాలు బయటపెట్టింది. కారులో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది.

ఇవాళ్టి నుంచి 2022ను రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెడతానని ప్రకటించింది త్రిష. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. 20 ఏళ్లకు పైగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ చెన్నై బ్యూటీ.. ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉండడం విశేషం.

trisha tested corona negative2
trisha tested corona negative2

ఇప్పటికే 3 తమిళ సినిమాలు పూర్తిచేసింది. ఓ మలయాళం సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం ఆమె ఓ సినిమా డబ్బింగ్ కు వెళ్తూ ఇలా సెల్ఫీ దిగింది. ఒక‌ప్పుడు త్రిష తెలుగు సినిమాల‌తో ఎంత‌గా అల‌రించింది. కాని ఇప్పుడు ఆమె కేవ‌లం త‌మిళంలోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.