TRISHA: బిజినెస్ మెన్‌తో రెండో పెళ్లికి సిద్ధ‌మైన త్రిష‌.. ముహూర్త‌మెప్పుడో మ‌రి!

TRISHA చెన్నై చంద్రం త్రిష తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితం. ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రితో క‌లిసి పని చేసిన త్రిష ఇప్పుడు కేవ‌లం త‌మిళ ఇండ‌స్ట్రీకి పరిమిత‌మైంది. లేడి ఓరియెంటెడ్ సినిమాల‌తో పాటు విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా త్రిష పెళ్లికి సంబంధించిన వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌తంలో త్రిష వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అనివార్య కార‌ణాల వ‌ల‌న ఇద్ద‌రు విడిపోయారు. ఇక అప్ప‌టి నుండి త్రిష త‌న పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు.

తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం త్వ‌ర‌లోనే త్రిష పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ఓ బిజినెస్ మెన్‌తో ఈ అమ్మ‌డికి వివాహం నిశ్చ‌యించాల‌ని వారి పెద్ద‌లు అనుకున్నార‌ట‌. ఇప్ప‌టికే పెళ్లికి సంబంధించి ముచ్చ‌ట కూడా పూర్తైంద‌ని టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. ప్ర‌స్తుతం త్రిష చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఆ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న త్రిష క‌రోనా వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైంద‌ట‌. ఈ ఖాళీ స‌మ‌యంలో త‌న పెళ్లికి సంబంధించి రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్టు వినికిడి.

Advertisement