Trisha Krishnan : ఈ వయసులోనూ బాగా పెంచేసిన త్రిష!
NQ Staff - April 30, 2023 / 06:19 PM IST

Trisha Krishnan : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ త్రిష ఈ మధ్య కాలంలో కాస్త తెలుగులో సైలెంట్ అయిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొనియిన్ సెల్వన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తమిళనాడు భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ఐశ్వర్యరాయ్ నటించిన కూడా త్రిష పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత దక్కింది.
అంతే కాకుండా త్రిష యొక్క లుక్ కూడా బావుంది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. అందుకే ఈ వయసులో కూడా త్రిషకి భారీగా ఆఫర్స్ రావడం మాత్రమే కాకుండా మొన్న మొన్నటి వరకు కోటి రూపాయల నుండి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకునే త్రిష ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట.
మణిరత్నం సినిమా దయ వల్ల ఆమెకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత రెమ్యూనరేషన్ పెంచడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
సాధారణంగా హీరోయిన్స్ వయసు పెరిగిన తర్వాత రెమ్యూనరేషన్ తగ్గుతూ తగ్గుతూ వస్తుంది.. కానీ త్రిష కి మాత్రం పెరగడం విడ్డూరంగా ఉందని ఆమె అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.