Trisha Krishnam : ఈ అందగత్తె వయసు నాలుగు పదులంటే ఎవరైనా నమ్ముతారా?

NQ Staff - September 22, 2022 / 02:23 PM IST

160075Trisha Krishnam : ఈ అందగత్తె వయసు నాలుగు పదులంటే ఎవరైనా నమ్ముతారా?

Trisha Krishnam : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా నటిస్తున్న అందాల తార త్రిష వయసు నాలుగు పదుల కి చేరువయ్యింది. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు పదులు దాటి పోయింది, అయినా కూడా ఇంకా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

ఈమె తాజాగా నటించిన

Trisha Krishnam Latest Beautiful Photos

Trisha Krishnam Latest Beautiful Photos

తమిళ భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో త్రిష పాల్గొన్నారు. అందులో భాగంగా త్రిష కొన్ని ఫోటో షూట్స్ ఇచ్చింది. ఆ ఫోటో షూట్ లో త్రిష ని చూస్తుంటే పాతికేళ్ల అమ్మాయి అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Trisha Krishnam Latest Beautiful Photos

Trisha Krishnam Latest Beautiful Photos

ఈ ఫోటోలను చూపించి 40 సంవత్సరాల వయసున్న మహిళ ఈమె అంటే ఎవరు నమ్మక పోవచ్చు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి త్రిష ఇంకా కూడా వెంకటేష్ తో గతంలో నటించిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటూ తెలుగు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా నటించిన ఘనత ఈమెకు దక్కింది. యంగ్ స్టార్ హీరోలతో కూడా ఈమెకు నటించే అవకాశాలు వచ్చాయి. మరో ఐదు పది సంవత్సరాల పాటు ఈమె తెలుగులో మరియు తమిళంలో సినిమాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Trisha Krishnam Latest Beautiful Photos

Trisha Krishnam Latest Beautiful Photos

హిందీలో ఈ వయసు వరకు సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మన సౌత్లో ఆ ఘనత కేవలం త్రిష కు మాత్రమే దక్కుతుందేమో. ఈ వయసులో కూడా మంచి ఫిజిక్ అందం మెయింటెన్స్‌ చేస్తున్న త్రిష అమ్మాయిల అందరికీ ఆదర్శం అనడంలో సందేహం లేదు.